Ponniyin Selvan 2 Twitter Review: ఈసారి మణిరత్నం మరో మ్యాజిక్.. మొత్తంగా ఎలా ఉందంటే?

లెజెండరీ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో పార్ట్ 2 తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై మణిరత్నం ఆవిష్కరించారు. తమిళంలో హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా వస్తోన్న ఈ సిరీస్ లో పార్ట్ 1కి ఒక్క తమిళంలో తప్ప ఇంకెక్కడ ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. ఈ నేపధ్యంలో పొన్నియన్ సెల్వన్ 2పై పెద్దగా బజ్ అయితే లేదు. తమిళనాట మాత్రం కొంత వరకు హైప్ ఉంది. మిగిలిన భాషలలో మణిరత్నం మూవీ కాబట్టి చూడొచ్చు అనే అభిప్రాయం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పడిపోయాయి. ట్విట్టర్ లో పొన్నియన్ సెల్వన్ 2 పై సోషల్ మీడియాలో నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి పార్ట్ కంటే బెటర్:ఫిలిం క్రిటిక్స్ కూడా సోషల్ మీడియాలో పీసీ 2 టాక్ షేర్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్ లో రివ్యూలు బట్టి చూసుకుంటే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. PS 1 కంటే 2 చాలా బెటర్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా కుందవి, నందిని క్యారెక్టర్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఐశ్వర్య రాయ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో నందిని పాత్రతో కథని శాసించిందని పేర్కొన్నారు.

Mani Ratnams Ponniyin Selvan 2 Twitter Review live updates review

చోళుల రాజ్యంలో జరిగే కుట్రలు:ఇక ఆదిత్య కరికాలన్ గా చియాన్ విక్రమ్ సీక్వెన్స్ సూపర్బ్ గా ఉన్నాయంట. నందిని, కారకాలన్ కలుసుకునే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని టాక్. ఇక వందియదేవన్ పాత్రలో కార్తీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ 2లో కూడా కొనసాగింది. ముఖ్యంగా చోళుల రాజ్యంలో జరిగే కుట్రలు, వాటికి ఆదిత్యుడు, కుందవి, అరుణ్మొళి వర్మన్ చెప్పే సమాధానాలతో కథ ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా మణిరత్నం నేరేట్ చేశారు.

కొంత నెగిటివ్ టాక్:అయితే కథని చాలా స్లో ఫేస్ లో మణిరత్నం నడిపించారంట. పాత్రలని స్ట్రాంగ్ ఎలివేషన్ చూపించాల్సిన చోట కూడా డ్రామాని పండించడటం, నెమ్మదిగా సాగే కథనం PS 2కి కొంత నెగిటివ్ టాక్ తీసుకొస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదంట.

ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని:పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కంటే చాలా బెటర్ గా 2 ఉందని కోలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ నుంచి టాక్ వస్తోంది. అలాగే ప్రతి పాత్రని డిటైల్డ్ గా మణిరత్నం ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా చేసారంట. స్లో నేరేషన్ అక్కడక్కడా ఉన్నా కూడా కథ మాత్రం చాలా పెర్ఫెక్ట్ గా చెప్పారంట. కచ్చితంగా ఈ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని టాక్.

అలాంటి టాక్ రావచ్చు:ఇక తెలుగునాట అయితే ఈ మూవీకి ఆశించిన స్థాయిలో టాక్ రావడం లేదు. PS 1 తరహాలోనే 2 కూడా ఉంటుందనే అభిప్రాయం నెటిజన్లు నుంచి వ్యక్తం అవుతుంది. అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ అలాగే నందిని, కరికాలన్ కాంబినేషన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయంట. ఏవరేజ్ టాక్ తెచ్చుకోవచ్చు అని పోస్టులు పెడుతున్నారు.

పార్ట్2లో మణిరత్నం సమాధానం:పార్ట్ 1లో ఉన్న చాలా ప్రశ్నలకి పార్ట్2లో మణిరత్నం సమాధానం చెప్పారు. పాజిటివ్ టాక్ రావడంతో మెల్లగా సినిమా ప్రేక్షకులకి రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడు మూవీ చాలాచోట్ల హౌస్ ఫుల్ పడింది. తమిళ్, మలయాళీ భాషలలో ఉదయం 4 గంటలకి ప్రీమియర్స్ పడ్డాయి. ఓవరాల్ గా మూవీ ట్విట్టర్ రివ్యూల బట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X