Ponniyin Selvan: I చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాలి.. ట్విస్టు ఇచ్చిన మణిరత్నం
చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాలి.. ట్విస్టు ఇచ్చిన మణిరత్నం
దేశం గర్వించదగిన డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్, మెడ్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానుంది పొన్నియిన్ సెల్వన్. పీయస్-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక సమయంలో విడుదల చేయనున్నారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ చిత్రంలోంచి చోళ చోళ అనే పాటను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో..

మణిరత్నం మాట్లాడుతూ.. 'చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి. కానీ అది ఎందుకు అనేది చెప్పను. తరువాత మీకే తెలుస్తుంది. రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు తీయగలమనే ధైర్యం వచ్చింది. రెండు పార్టులుగా ఇలాంటి చిత్రాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకే ఆయనకు థాంక్స్. నా బిడ్డ లాంటి ఈ చిత్రం ఇక దిల్ రాజు గారిదే. ఆయనే తెలుగులో ఈ సినిమాను చూసుకోవాలి. తనికెళ్ల భరణి గారికి థాంక్స్. చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాను తీయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు


Click it and Unblock the Notifications











