పనిలేక ఈగలు తోలుకుంటున్నా... లెజెండరీ మణిశర్మ కంటతడి

చిత్ర పరిశ్రమ విచిత్రమైనది.. సక్సెస్‌లు ఉన్నవారికే ఇక్కడ విలువ, గౌరవం. ఏమాత్రం ఫ్లాప్ పడినా కెరీర్ అంతేసంగతులు. అదృష్టమే కాపాడాలి తప్పించి ఎవరూ వెంట నిలవరు. పూలు పడిన చోటే రాళ్లు పడతాయి. ఇలాంటి అనుభవం చిత్ర పరిశ్రమలో ఎంతోమందికి ఎదురైంది. దిగ్గజాలుగా వెలుగొందిన వారు సైతం చివరి రోజుల్లో ఎలా బతికారో? ఎలా పోయారో కూడా తెలియదు. ఈ కోవలోకే వస్తారు దిగ్గజ సంగీత దర్శకుడు మణిశర్మ. ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా పనిచేసిన ఈయనకి ప్రస్తుతం అవకాశాలు లేవు. తన పరిస్ధితిని వివరిస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

ఎంతోమంది స్టార్స్‌కి సంగీత దర్శకుడిగా పనిచేసి.. మెలోడీ బ్రాహ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. నేపథ్య సంగీతం విషయంలోనూ సరికొత్త బెంచ్ మార్క్‌లు క్రియేట్ చేశారని అంటారు. సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు మణిశర్మే కావాలని ఒకప్పుడు ఆయన వెంట పడేవారు. ఇప్పటికీ మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు ఆల్ టైం బ్లాక్ బస్టర్స్‌‌గా నిలిచాయి. దశాబ్ధానికి పైగా తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు మణిశర్మ. 30 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వందలాది చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

Mani Sharma Opens Up on Career Struggles and Comeback with Chennai Love Story

అయితే దేవిశ్రీప్రసాద్, తమన్, అనూప్ రూబెన్స్, మిక్కీజే మేయర్, అనిరుధ్ సహా కొత్త కుర్రాళ్ల రాకతో మణిశర్మకు అవకాశాలు తగ్గిపోయాయి. చిన్నా చితకా సినిమాలు సహా పెద్ద స్టార్స్ ఎవరూ ఆయనకు ఛాన్స్‌లు ఇవ్వడం లేదు. గతేడాది ఎల్‌వైఎఫ్: లవ్ యూవర్ ఫాదర్, కన్నప్పలో ఒక పాట, కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలకు సంగీతం అందించిన మణిశర్మ.. ఈ ఏడాది సహ కుటుంబానాం అనే సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న చెన్నై లవ్ స్టోరీ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌లు చెన్నై లవ్ స్టోరీ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన శ్రీగౌరి ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వాస్ డానియేల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చెన్నై లవ్ స్టోరీలోని గురుతుందా అనే సాంగ్‌ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మణిశర్మ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

తొలుత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఆ రోజుల్లో ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు వినడానికే టికెట్లు కొనుక్కొని థియేటర్లకు వెళ్లే వాళ్లం. అదొక అడిక్షన్. కానీ మనం బాగా ప్రేమించే వాళ్ల దగ్గరికి వెళ్లొచ్చా.. లేదా అనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. పైగా కలిసి వర్క్ చేయాలని అన్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి వెళ్లాలి. దాని వల్ల రెండు జరగొచ్చు.. ఇంత ప్రేమించిన మనిషి దగ్గరి నుంచి ది బెస్ట్ తీసుకోగలమా? ఉన్న ప్రేమ ఎక్కడికి పోతుందా అనే కన్‌ఫ్యూజన్ మధ్యలో మహతి స్టూడియో మెట్లెక్కాను. ప్రతి పాటకు ఒకటే ట్యూన్.. రెండో ట్యూన్ కూడా అడగలేదు. నాకు, ఆయనకు ఇళయరాజా గారంటే ఇష్టం.

సినిమా పేరు చెన్నై లవ్ స్టోరీ. ఇయళరాజా గారికి ట్రిబ్యూట్ ఇస్తూనే మణిశర్మ గారి బ్రాండ్ మిస్ అవ్వకూడదని మ్యూజిక్ చేస్తూ వచ్చాను. మధ్యలో కావాల్సి వస్తే సచ్చినోడా ఏం కావాలో చెప్పి ఏడువు అంటాడు? లేదంటే బంగారం నచ్చిందా? అని రెండే వర్డ్స్ ఉంటాయి. ఆయన సినిమాలను చూసి నేర్చుకుని మిగతావారిని విసిగించేవాడిని. నేను మణిశర్మ గారికి కరెక్షన్స్ చెప్పగలనా? నేను ప్రొడ్యూసర్‌గా ఉంటే.. మీరు ట్యూన్స్ గురించి చెబుతుంటే ఇంతకు మించి ఏం కావాలి? అని సాయిరాజేష్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు మణిశర్మ కంటతడి పెడుతూనే ఉన్నారు.

అనంతరం మణిశర్మ మాట్లాడుతూ.. ఒకరోజున ఉదయాన్నే లేచి నా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈగలు తోలుకుంటుండగా సాయి రాజేష్ వచ్చారు. ఆయన నాకు ముందు పరిచయం లేదు. నేను బేబీ సినిమా డైరెక్టర్‌ని అని పరిచయం చేసుకున్నారు. ఆయనకు నాతో ఏం పని ఉంటుంది అనుకున్నా. మీరు నా సినిమాకు మ్యూజిక్ చేయాలని సాయి రాజేష్ చెప్పారు. నా హర్మోనియం ఎక్కడుందో కూడా తెలియదు అంటే .. ఆయనే వెతికి పట్టుకుని, దుమ్ము దులిపి అలా కూర్చోబెట్టారు. వర్క్ స్టార్ట్ చేసి ఒక ట్యూన్ పూర్తి చేశాక.. లోపలి నుంచి ఏదో బయల్దేరినట్లు అనిపించింది. అప్పటి నుంచి బ్రహ్మండంగా వర్క్ చేశాం.. ఇక అంతా డెస్టినీ. మనందరికీ మంచి జరగాలని టీమ్ మొత్తానికి నా విషెస్. కిరణ్ అబ్బవరంతో ఇది నా రెండో సినిమా ఆయనకు ఆల్ ది బెస్ట్ అని మణిశర్మ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో వైరల్ అవుతున్నాయి.

Read more about: mani sharma kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X