హైదరాబాద్‌లో మణిరత్నం పాన్ ఇండియా ప్రాజెక్ట్.. సరికొత్త ప్లాన్!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సీనియర్ డైరెక్టర్ మణిరత్నం కూడా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్ అనే ఆ సినిమాలో కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు. ఇక ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ అయితే రోజుకోటి వైరల్ అవుతోంది.
దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అలాగే నయనతార, ఐశ్వర్యారాయ్, అదితి రావు హైదారి వంటి భామలు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమా షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నారు.

ఇక ముఖ్యమైన ఒక షెడ్యూల్ కోసం మణిరత్నం తన యూనిట్ తో కలిసి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ లో జయం రవి, కార్తీలు కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా సినిమాపై అంచనాలు భరిగానే ఉన్నాయి. కార్తీ ద్వారానే టాలీవుడ్ లో సినిమాకు హైప్ తేవాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











