Love Your Father మళ్లీ సినీ రంగంలోకి మనీషా.. యమలీల స్థాయి కంటెంట్‌తో!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా బ్యానర్లలో మనీషా ఆర్ట్స్ అని చెప్పుకోవడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి వారు నిర్మించిన కుటుంబ, హాస్య కథా చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. అలాంటి సినీ నిర్మాణ సంస్థ కొద్ది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఓ మంచి సినిమాతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా అన్నపరెడ్డి స్టూడియోస్, మనీషా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ యువర్ ఫాదర్ (LYF). ఈ సినిమాకు పవన్ కేతరాజు దర్శకత్వం వహించగా, కిషోర్ రాఠి, మహేశ్ రాఠీ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రారంభ వేడుక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఘనంగా జరిగింది. కాలేజీ యాజమాన్యం, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Manisha Arts Re Entry with Love Your Father movie: Here is the Details

ఈ సందర్భంగా నిర్మాత మహేష్ రాఠీ మాట్లాడుతూ.. 1983 నుంచి మా బ్యానర్‌లో ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించాం. మా బ్యానర్ ప్రతిష్టకు తగినట్టే లవ్ యువర్ ఫాదర్ మూవీ ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్, బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు అని తెలిపారు.

దర్శకుడు పవన్ కేటారాజు మాట్లాడుతూ.. నేను చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో పలు సినిమాలకు కో డైరెక్టర్‌గా పనిచేశాను. నా గురించి తెలిసి.. స్వయంగా కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నన్ను పిలిచి ఈ సినిమా అవకాశం ఇచ్చారు. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ రాఠీ, రమేశ్ రెడ్డికి ధన్యవాదాలు అని అన్నారు. ఈ వేడుకలో హీరో శ్రీహర్ష, రియా, డీవోపీ మహేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Manisha Arts Re Entry with Love Your Father movie: Here is the Details

నటీనటులు: శ్రీహర్ష, కషికా కపూర్, ఎస్పీ చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, అంజన్ శ్రీవాస్తవ్, అమన్ వర్మ తదితరులు
నిర్మాత: కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ
దర్శకత్వం: పవన్ కేట్రాజు
డీవోపీ: మహీంద్ర కుమార్
మ్యూజిక్: మణిశర్మ
ఎడిటర్: అమర్‌రెడ్డి కుడుముల
బ్యానర్: మనీషా ఆర్ట్స్, మీడియా ప్రైవేట్ లిమిటెడ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X