చిరంజీవి ఓకే అంటే నేను రెడీ.. ఒక్క రూపాయి కూడా అవసరం లేదు: మణిశర్మ

తెలుగు సినిమా గర్వించదగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ఆయన గత నాలుగు దశాబ్దాలుగా వెండితెరకు సరికొత్త అందం తెస్తూనే ఉన్నారు. ఆయన సినీ ప్రయాణంలో ఎందరో దర్శకనిర్మాతలు, సంగీత దర్శకులతో కలిసి పని చేశారు. ఎక్కడా చిన్న మచ్చ కూడా లేని మహారాజుగా వారందరి గుండెల్లో చోటు దక్కించున్న ఆయన అంటే సినీ పరిశ్రమలోని ఎంతో మందికి చాలా ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా అందులో ఒకరు.

నిన్న (ఆగస్టు 22) మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులంతా పండుగ చేసుకోగా.. పలువురు సినీ సెలెబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెష్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. చిరంజీవితో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశానని, మున్ముందు ఇంకా చేస్తానని అన్నారు. అయితే ఒక్క రూపాయి రెమ్మ్యూనరేషన్ కూడా రాకున్నా కూడా ఆయన సినిమాలకు సంగీతం అందిస్తానని, అన్నయ్య అంటే తనకు అంత అభిమానమని తెలిపారు మణిశర్మ.

Manisharma Comments on Chiranjeevi

అన్నయ్య కామెడీ కూడా బాగా చేస్తారని, ఆయనలోని పూర్తి కామెడీ కోణాన్ని ప్రేక్షకులు ఇప్పటిదాకా చూడలేదని అన్నారు. అన్నయ్య కామెడీ చేస్తే బ్రహ్మానందం కూడా తట్టుకోలేరంటూ ఆసక్తికరంగా మాట్లాడారు మణిశర్మ. ఇక చిరంజీవి తాజా సినిమాల విషయానికొస్తే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతిత్వరలో కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు మెగాస్టార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X