twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్ పార్టీలో దీపిక, రణ్‌బీర్ గ్యాంగ్.. కరణ్ జోహర్‌పై ఎన్సీబీకి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

    |

    బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు, హోస్ట్ కరణ్ జోహర్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న కరణ్ జోహర్ పార్టీకి సంబంధించిన వీడియో ఆధారంగా ఎన్సీబీ చీఫ్ రాకేశ్ అస్థానాకు ఫిర్యాదు చేశారు. గతంలో కరణ్ జోహర్ నిర్వహించిన పార్టీలో పాల్గొన్న పలువురు టాప్ హీరో, హీరోయిన్లు డ్రగ్స్ వాడారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

    ఎన్సీబీ అధికారులు ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా మీడియాతో మాట్లాడుతూ.. 10 నెలల క్రితం అంటే ఆగస్టు 1, 2019లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ వారు ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదు. నా ఫిర్యాదును స్పీడ్ పోస్టులో పంపాను. అయినా ఫలితం లేకపోయింది. పలుమార్లు వారిని సంప్రదించినా విచారణ చేపట్టలేదు. ఆ క్రమంలోనే తాను ఆ వీడియోను నా ట్విట్టర్‌లో పోస్టు చేశాను అని సిర్సా తెలిపారు.

    Manjinder Singh Sirsa filed a complaint on Karan Johar with NCB Chief Rakesh Asthana

    నా ఫిర్యాదుపై ముంబై పోలీసులు స్పందించి ఆ సమయంలో విచారణ చేపట్టినట్లయితే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సంభవించేది కాదు అనే అభిప్రాయాన్ని సిర్సా వ్యక్తం చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ముంబై పోలీసులు స్పందించకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్ మాఫియా ఎంత బలంగా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. నా ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్సీబీ చీఫ్‌కు అందజేశాను అని సిర్సా వెల్లడించారు.

    కరణ్ జోహర్ నివాసంలో జరిగిన పార్టీలో షాహిద్ కపూర్, ఆయన భార్య మీరా రాజ్‌పుత్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోన్, వరుణ్ ధావన్, నటాషా దలాల్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, వికీ కౌశల్, రోహిత్ ధావన్, ఆయన భార్య, జోయా అఖ్తర్, షకున్ బాత్రా, ఆయన్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Former Delhi MLA Manjinder Singh Sirsa filed a complaint on Karan Johar's party video with NCB Chief Rakesh Asthana. Sirsa said that he had filed a complaint about this video with Mumbai police 10 months ago on August 1, 2019, but it failed to even initiate an investigation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X