Don't Miss!
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్‌లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Never Before Ever After అంటూ ఇరగదీసిన మహేష్ సోదరి మంజుల.. ఏం చేసిందంటే..
అనిల్ రావిపూడి సినిమా అంటే ఏదో ఒక మ్యానరిజం ఉంటుందన్న సంగతి తెలిసిందే. రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాల్లో ఆ మ్యానరిజాలు వర్కవుట్ అయ్యాయి కూడా. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనూ పెట్టాడు. హీరోయిన్ రష్మిక మందాన్నకు అర్థమవుతుందా? అంటూ ఓ డిఫరెంట్ మ్యానరిజాన్ని క్రియేట్ చేయగా.. నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ ఓ భిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో కూడిన మ్యానరిజాన్ని పెట్టాడు.
ట్రైలర్లో హైలెట్
సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశాక.. మహేష్ కామెడీ టైమింగ్, డిఫరెంట్ మ్యానరిజం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఖలేజా, దూకుడు వంటి చిత్రాల్లో ప్రత్యేకమైన మ్యానరిజంలో మెప్పించిన మహేష్ బాబు.. సరిలేరు చిత్రంలోనూ అందరినీ ఆకట్టుకున్నాడు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని మహేష్ చెప్పిన ఈ డైలాగ్, ఆ మ్యానరిజం అందరికీ ఎక్కేసినట్టు కనిపిస్తోంది.
|
మంజుల సైతం..
మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని సైతం మహేష్ మ్యానరిజాన్ని అనుకరించింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్‌లకు థియేటర్లలో విజిల్స్ మోత మోగుతుంటే.. సోషల్ మీడియాలోనే అదే రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్బంగా మంజుల విడుదల చేసిన వీడియోన తెగ వైరల్ అవుతోంది.
సోదరుడిని మెచ్చుకున్న మంజుల
ఇలాంటి చిత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ మహేష్ స్టైల్లోనే మంజుల కూడా చెప్పేసింది. అబ్బబ్బ.. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ మంజుల చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇలాంటి హీరో నెవర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ సినిమా చాలా నచ్చిందని ట్వీట్ చేసింది.
సరిలేరుపై స్పందిస్తోన్న టాలీవుడ్..
సరిలేరు నీకెవ్వరు చిత్రంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన దర్శకులు శ్రీను వైట్ల, హరీష్ శంకర్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా హీరోల నుంచి విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు, వరుణ్ తేజ్, సుశాంత్ వంటి వారు సరిలేరుపై ట్వీట్స్ చేశారు.