Manjummel Boys Premiers: ఒక్కరోజు ముందుగానే మంజుమ్మల్ బాయ్స్.. ఎక్కడ, ఎలా చూడొచ్చంటే?
మలయాళ భషలో తెరకెక్కిన రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరికీ తెలుసు. అద్భుతమైన కథాశంతో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా మిగతా భాషల్లోకి కూడా డబ్ అవుతుంది. ముఖ్యంగా తెలుగులోకి కూడా ఈ సినిమాను తీసుకు వస్తుండగా.. ఏప్రిల్ 6వ తేదీన విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రీమియర్స్ కూడా వేశారు. ఏప్రిల్ 5న ఐదు చోట్ల ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని పరవ ఫిల్మ్స్ నిర్మించారు. ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువాల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్, చందు సలీంకుమార్, షెబిన్ బెన్సన్, మరియు విష్ణు రేఘు తదితరులు నటించారు. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా అత్యధిక వసూళ్లు చేసిన మూడో భారతీయ చలనచిత్రంగా నిలిచింది. అయితే అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు. కేవలం డబ్ చేయడమే కాకుండా.. థియేటర్లలో కూడా విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేశారు.
అటు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలోనూ పలు చోట్లు ఈ సినిమా ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ ప్రత్యేక షోలు నడుస్తాయి. అయితే హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో మైత్రి జగదాంబ థియేటర్లో సాయంత్రం 6.30 నిమిషాలకు మంజుమ్మల్ బాయ్స్ సినిమా షో పడబోతుంది అలాగే అదే సయమానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ లో కూడా ఈ సినిమాను చూడొచ్చు.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి.. శ్రీ సాయి క్రిష్ణ థియేటర్ లో సాయంత్రం 6.30కి ఈ షో వేస్తారు. అలాగే వైజాగ్ లో శ్రీరామ థియేటర్ లో 6.15 నిమిషాలకు మంజుమ్మల్ బాయ్స్ చిత్రం ప్లే కానుంది. అలాగే నెల్లూరులో 7.30 గంటలకు ఎం1 సినిమాస్ లో ఈ సినిమా ప్రీమియర్ షో వేయనున్నారు.


Click it and Unblock the Notifications











