రకుల్‌ని అద్దెకు తెచ్చుకున్న మన్మథుడి కష్టాలు.. పీక్స్‌లోకి వెళ్లిపోయాయి
గతంలో 'మన్మథుడు'గా హీరోయిన్లతో తెగ ఎంజాయ్ చేసిన నాగార్జున.. మన్మథుడు 2 రూపంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫ్రెంచ్ సినిమా యొక్క ఫ్రీమేక్ అనేది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ముందుగానే ప్రకటించి ఓ సినిమాను వేరే భాషలో తెరకెక్కిస్తే అది రీమేక్. అదే ఎలాంటి ప్రకటన లేకుండా డైరెక్టుగా విడుదలైన కథను వాడేస్తే అది ఫ్రీమేక్. అయితే ఫ్రీమేక్ చేసిన సందర్భాల్లో వివాదాలు తలెత్తడం సహజం.
తాజాగా నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న మన్మథుడు 2 విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమాను 2006లో ఫ్రెంచ్‌లో విడుదలైన 'ప్రేతే మెయి తా మై' సినిమా కథ ఆధారంగా రాహుల్ రవీంద్రన్ రాసుకున్నాడని, సరిగ్గా ఆ సినిమాలో చూపించిన పాయింట్ నే మన్మథుడు 2 సినిమాలో చూపించబోతున్నాడనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఫ్రెంచ్ సినిమా కథ ప్రకారం హీరోకు 45 ఏళ్లొచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోక పోవడంతో.. ఇంట్లో వాళ్లు కూడా పెళ్లెప్పుడు అంటూ అతన్ని సతాయించడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఓ అమ్మాయిని భార్యగా అద్దెకు తీసుకొస్తాడు హీరో. అయితే ఆ తర్వాత ఆ ఇద్దరే ప్రేమలో పడటం జరుగుతుంది. సరిగ్గా ఇదే పాయింట్ మన్మథుడు 2 లో వాడేశాడట రాహుల్ రవీంద్రన్.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను తన భార్యగా నాగార్జున అద్దెకు తెస్తాడని, ఆ తరువాత నాగ్- రకుల్ ప్రేమ, రొమాన్స్ ఇదే మన్మథుడు 2 థీమ్ అని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా ఒరిజినల్ కాపీ నిర్మాతలు (ఫ్రెంచ్ సినిమా నిర్మాతలు) కాపీ రైట్ వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రకుల్‌ని అద్దెకు తెచ్చుకున్న మన్మథుడు మున్ముందు కష్టాలు తీరేనా? లేక వివాదం ముదిరేనా? అనేది చూడాలి మరి.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మథుడు 2 ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పుర్తిచేసుకుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 9న మన్మథుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











