నాగార్జున ‘మన్మధుడు 2’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఈ నెల్లోనే!
నాగార్జున ప్రధాన పాత్రలో సూపర్ హిట్ మూవీ 'మన్మధుడు'కు సీక్వెల్ రాబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో 'మన్మధుడు 2' చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ ఇద్దరు మాత్రమే కాకుండా నాగార్జున కోడలు సమంత కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు, ఈ మేరకు దర్శకుడు రాహుల్ ఆమె కోసం చిన్న పాత్ర రాసినట్లు టాక్.

కాగా... 'మన్మధుడు 2' షూటింగ్ మార్చి 25న నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోనే మొదలు పెట్టబోతున్నారు. ఏప్రిల్ 14 వరకు తొలి షెడ్యూల్ పూర్తవుతుందని తెలుస్తోంది.
కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఏప్రిల్ 14 నుంచి సెకండ్ షెడ్యూల్ పోర్చుగల్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే చిత్ర బృందం మరిన్ని విషయాలు అషీఫియల్‌గా వెల్లడించనున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











