‘మన్మధుడు 2’ టైటిల్ రిజిస్టర్ చేయించిన నాగార్జున?

By Bojja Kumar

నాగార్జున కెరీర్లో టాప్ మూవీస్ తీసుకుంటే అందులో 'మన్మధుడు' చిత్రానిది ప్రత్యేక స్థానం. కె విజయభాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ చిత్రం టీవీలో వస్తే ఇప్పటికీ చూడటానికి చాలా మంది ఇస్టపడుతుంటారు. నాగార్జున, సోనాలి బింద్రే నటనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ, డైలాగులు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా సినిమాలో అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.

దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ మన్మధుడు పేరు తెరపైకి వచ్చింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందనే ప్రచారం మొదలైంది. అందుకు కారణం 'మన్మధుడు 2' అనే టైటిల్ రిజిస్టర్ కావడమేనంట. ఈ టైటిల్ రిజిస్టర్ చేయించింది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద నాగార్జున అని టాక్.

Manmadhudu 2 title registered

ఈ వార్తలు తెరపైకి వచ్చినప్పటి నుండి రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ వయసులో నాగార్జున మన్మధుడిగా మెప్పించగలడా? అని కొందరు... ఇది నాగార్జున కోసం కాదు ఆయన కుమారులు నాగ చతన్య లేదా అఖిల్ నటించే అవకాశం ఉందని మరికొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మన్మధుడు అంటే మనకు నాగార్జున తర్వాత.... కథ, డైలాగులు రాసిన త్రివిక్రమ్ ఎక్కువ గుర్తొస్తుంటాడు. మరి 'మన్మధుడు 2'లో ఈ మాటల మాంత్రికుడి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? అనేది తెలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X