‘మన్మథుడు 2’ ట్రైలర్: ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేం.. లిప్ లాక్స్‌కు అంతే లేదుగా!
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. గతంలో నాగార్జున్, సోనాలి బింద్రె, అన్షు కాంబినేషన్‌లో వచ్చిన 'మన్మథుడు'కు కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్లకు విశేష స్పందన వచ్చింది. అదే సమయంలో వివాదాలు కూడా చెలరేగాయి.
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. దాదాపు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్‌ను ఎంతో స్టైలిష్‌గా కట్ చేశాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. కామెడీ, లవ్, ఎమోషన్‌లకు చూపించారు. ఇందులో నాగ్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. అంతేకాదు, వెన్నెల కిశోర్‌తో వచ్చే సీన్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. అలాగే, ఈ ట్రైలర్‌లో 'ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేం' అని నాగ్ చెప్పే డైలాగ్ పేలుతుంది. దీనితో పాటు 'ఏ అమ్మాయ్.. బానే ఉన్నావుగా.. వీడిని చేసుకుంటున్నావేంటి..? ఇంతకీ మీది ఏ క్యాస్ట్..?' అని రావు రమేశ్ మాట్లాడే డైలాగ్స్ బాగున్నాయి.

యంగ్ కమెడియన్ వెన్నెల కిశోర్ పాత్రకు కూడా ఈ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్నదని అనిపిస్తుంది. ఈ ట్రైలర్‌లో అతడు చెప్పే డైలాగులు బాగున్నాయి. 'మీర వాళ్ల చాదస్తం కాకపోతే మీరేమన్నా మన్మథుడా ఏంటి..?' అని ఒకటి, చివర్లో 'మీ కృష్ణావతారం అయిపోయింది.. ఇక రామావతారం స్టార్ట్స్' అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, టీజర్‌లో చూపించినట్లే ట్రైలర్‌లో కూడా కొన్ని లిప్ లాక్స్ చూపించాడు దర్శకుడు. మరి, దీనిపై ఎన్ని వివాదాలు వస్తాయో చూడాలి. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


Click it and Unblock the Notifications











