ఇప్పటి దాకా U.. ఇక నుంచి A సర్టిఫికెట్ చూపిస్తా.. యమ హాట్‌గా రకుల్ ప్రీత్
Recommended Video
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మథుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేశారు యూనిట్ సభ్యులు. అందరూ ఊహించినట్లుగానే రకుల్ ప్రీత్ రెచ్చిపోయి నటించిందని, ఆమె క్యారెక్టర్ ఈ సినిమాకు హైలైట్ అవుతుందని ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. కేవలం ఒక నిమిషం 5 సెకన్లతో కట్ చేసిన ఈ టీజర్ లో రకుల్ తెగువ చూపించారు.
అవంతిక పేరే ఎంత వినసొంపుగా ఉంది
మన్మథుడు 2 సినిమాలో రకుల్ పోషించిన పాత్ర పేరు అవంతిక. ఇదే పేరుతో రకుల్‌ని పరిచయం చేస్తూ టీజర్ వదిలారు. ''అవంతిక పేరే ఎంత వినసొంపుగా ఉంది.. అంతే పద్ధతి గల అమ్మాయి'' అని లక్ష్మి చెబుతున్న డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో రకుల్ పీక్ లెవెల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించింది.

బొంగేమ్ కాదు.. నాగార్జున
ముందుగా పద్దతిగా కనిపించిన రకుల్, ఆ తర్వాత మెల్లగా తన విశ్వరూపం చూపించింది. 'ఆ అమ్మాయి చాటి గాలి లాంటిది సర్' అని నాగార్జునతో వెన్నెల కిషోర్ అనగా 'బొంగేమ్ కాదు' అని నాగ్ అనడం చూస్తుంటే చిత్రంలో రకుల్ ఎంతలా రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ వెంటనే మోడ్రెన్ లుక్ లో రకుల్‌ని చూపిస్తూ ఆమె లోని గ్లామర్ అంతా బయటపెట్టారు. నాగార్జునతో రకుల్ చేసే చిలిపి వేషాలు చూపిస్తూ ఆసక్తి రేపారు.

ఇక నుంచి A చూపిస్తా.. రకుల్ ప్రీత్ తెగువ
ఇక చివరగా.. ''ఇప్పటిదాకా U సర్టిఫికెట్ ప్రయత్నించాను. ఇప్పుడు A సర్టిఫికెట్ చూపిస్తా'' అని నాగార్జునతో రకుల్ చెప్పే డైలాగ్ యూత్ ఆడియన్స్‌కి కిక్కిస్తోంది. ఈ ఒక్క డైలాగ్ చాలు మన్మథుడు 2 లో నాగార్జునతో రకుల్ ఏ రేంజ్ లో రొమాన్స్ చేసి ఉంటుందో చెప్పడానికి. మొత్తానికైతే అవంతికగా రకుల్ ప్రీత్ మన్మథుడు 2 అంచనాలను డబుల్ చేసేసింది.

మన్మథుడు 2 మూవీ
గతంలో వచ్చిన మన్మథుడు సినిమా ఇన్‌స్పిరేషన్‌తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2' చిత్రం తెరకెక్కుతోంది. చిత్రంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా కీర్తి సురేష్, సమంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











