'మన్మథుడు 2' కీలక అప్‌డేట్.. పోస్టర్ ద్వారా నాగార్జున కన్ఫర్మ్ చేశాడు
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన్మథుడు 2'. గతంలో నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన మన్మథడు చిత్రానికి సీక్వల్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడింది. షూటింగ్ మొదలు పెట్టిన కొద్ది రోజుల్లోనే ఎంతో హుషారుగా ఈ సినిమాను పూర్తిచేసే స్థాయికి తీసుకొచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబందించిన కీలక అప్‌డేట్ సిసిల మీడియా ద్వారా పంచుకున్నారు నాగార్జున.
'మన్మథుడు 2' మూవీ ఆగస్టు 9 వ తీదీన విడుదల కానుంది. హాయిగా నవ్వుకునేందుకు రెడీగా ఉండండి అని పేర్కొంటూ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ రిలీజ్ షేర్ చేశాడు నాగార్జున. ఈ అప్‌డేట్ ద్వారా 'మన్మథుడు 2' రిలీజ్ కన్ఫర్మ్ చేసేశాడు నాగ్. టాలీవుడ్ మన్మథుడిగా పేరుగాంచిన నాగార్జున ఈ సినిమాలో మరింత రొమాంటిక్ గా కనిపించనున్నారట. ఇక రకుల్ క్యారెక్టర్ అయితే ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్స్ 'మన్మథుడు 2' పై భారీ అంచనాలు నెలకొల్పాయి.

చిత్రంలో రకుల్ పోషించిన అవంతిక పాత్ర, సీనియర్ నటి లక్ష్మి నటన, నాగార్జున రోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిసింది. కుటుంబ సమేతంగా వచ్చి కడుపుబ్బా నవ్వుకునే సినిమానే 'మన్మథుడు 2' అంటోంది చిత్రయూనిట్. చిత్రంలో సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత నాగార్జున లోని మన్మథుడిని చూడాలని ఈ సినిమాపై ప్రేక్షకులు ఫుల్లుగా ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం మరి ఈ సారి మన్మథుడి హంగామా ఏ మేర ఉండనుందో!


Click it and Unblock the Notifications











