‘మన్మధుడు 2’ ప్రీ రిలీజ్ బిజినెస్: ఈ సారి నాగార్జున గట్టిగా కొట్టేలా ఉన్నాడు!
వయసు పరంగా అరవై ఏళ్లకు ఒక అడుగు దూరంలో ఉన్నప్పటికీ టాలీవుడ్లో మన్మధుడిగా విరాజిల్లుతున్న స్టార్ అక్కినేని నాగార్జున. కుర్రహీరోలతో పోటీ పడుతూ సత్తా చాటుతున్న ఆయన 'మన్మధుడు 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కాబోతోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగి పోయింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్ష్ రూ. 20.50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
తొలివారంలోనే వీకెండ్‌తో పాటు బక్రీద్, ఆగస్టు 15న హాలిడేస్ కలిసి రావడంతో సినిమాకు వసూళ్లు అదిరిపోవడం ఖాయం అంటున్నారు. దీంతో నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని సొంతగా రిలీజ్ చేస్తున్నారు. అటు యూత్‌కు నచ్చే అంశాలతో పాటు ఫ్యామిలీ మెచ్చే విషయాలు కూడా ఉండటంతో రెస్పాన్స్ అదిరిపోతుందని భావిస్తున్నారు.

ఏరియా వైజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే నైజాంలో రూ. 7 కోట్లు, సీడెడ్ రూ. 2.5 కోట్లు, ఆంధ్ర రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్ రూ. 2.40 కోట్లు... టోటల్ రూ. 20.50 కోట్లకు రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం.
'మన్మధుడు 2' మూవీలో నాగార్జున తన రొమాంటిక్ విశ్వరూపం చూపించబోతున్నాడు. ఇందులో ఆయన ప్లే బాయ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో నాగ్ ముద్దుల్లో మునిగితేలిన సన్ని వేశాలు ట్రైలర్ మొత్తానికే హైలెట్ అయ్యాయి.
నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రమిది.


Click it and Unblock the Notifications











