twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌ను వెంటాడుతున్న కరోనా.. మరో స్టార్ హీరోకు పాజిటివ్

    |

    బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనావైరస్ వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. గతంలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, కోవిడ్ 19 పడటం తెలిసిందే, అలాగే తాజాగా యువ హీరో రణ్‌బీర్ కపూర్, పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ‌కి కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం తెలిసిందే. కరోనావైరస్ బారిన పడిన జాబితాలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ కూడా చేరారు.

    తాజా సమాచారం ప్రకారం.. మనోజ్ బాజ్‌పేయ్ ప్రస్తుతం డిస్పాచ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ షూటింగులో పాల్గొంటుండగా ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దాంతో వైద్య పరీక్షలు జరిపించగా శుక్రవారం అంటే మార్చి 12 తేదీన ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు డిస్పాచ్ దర్శకుడు కాను బెహల్‌ కూడా కరోనా బారిన పడ్డారు.

    Manoj Bajpayee tested coronavirus positive after Ranbir Kapoor

    ప్రస్తుతం మనోజ్ బాజ్‌పేయ్‌ స్వీయ గృహ నిర్బంధంలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్సకు స్పందించి వేగంగా కోలుకొంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకొంటున్నారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    మనోజ్ బాజ్‌పేయ్ నటిస్తున్న డిస్పాచ్ చిత్రం క్రైమ్ జర్నలిజం ఆధారంగా థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని రోనీ స్కూవాలా నిర్మిస్తున్నారు.

    English summary
    Bollywood actor Manoj Bajpayee tested coronavirus positive after Ranbir Kapoor and Sanjay leela Bhansali. Now He is under doctors supervision who is under home quarantine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X