భైరవం మూవీకి ఖలేజా రీరిలీజ్ ఎఫెక్ట్స్.. మంచు మనోజ్ ఆవేదన
మంచు మనోజ్ ప్రస్తుతం తన కెరీయర్ పై ఫోకస్ పెట్టారు. 8 ఏళ్ల తర్వాత మళ్లీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాజాగా మనోజ్ 'భైరవం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అదితి శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. మంచు మనోజ్ తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన రోజే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'ఖలేజా' చిత్రం రీరిలీజ్ కావడం గమనార్హం. దీంతో భైరవం సినిమాపై ఎఫెక్ట్ పడిందనే టాక్ వచ్చింది. ఇక తాజాగా మనోజ్ కూడా ఇదే విషయంపై స్పందించారు.
భైరవంకు.. ఖలేజా రీరిరీలీజ్ తో సమస్య..
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన ఈ చిత్రం మే 30న విడుదలైంది. ఈ సినిమాతో ముగ్గురు కంబ్యాక్ ఇవ్వాలనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహించారు. కానీ అదే రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఖలేజా చిత్రం ప్రేక్షకుల ముందుకు రీరిలీజ్ ద్వారా వచ్చింది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ రీరిలీజ్ ను పండగ వాతావరణంలో జరిపారు. ఫలితంగా భైరవం సినిమాపై ప్రేక్షకుల దృష్టి తగ్గింది. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో తేడాలు కనిపించాయి.

భైరవం కలెక్షన్లు.. ఖలేజా రీరిలీజ్ కలెక్షన్లు ఇలా..
భైరవం చిత్రం, ఖలేజా రీరిలీజ్ చిత్రం ఓకే రోజు మే30నే విడుదలయ్యాయి. అయితే మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్, పైగా ఖలేజా సినిమాకు ఏర్పడ్డ ఫాలోయింగ్ తో భైరవం సినిమా కంటే ఖలేజా సినిమాకే ఆడియెన్స్ మొగ్గు చూపారు. కాగా ఖలేజా చిత్రం రీరిలీజ్ సందర్భంగా రెండు రోజుల్లో రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక భైరవం చిత్రం కేవలం రూ.8 కోట్ల వరకు గ్రాస్ అందుకుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇలా ఖలేజా రీరిలీజ్ వల్ల తమ సినిమాకు ఎఫెక్ట్ అయ్యిందని టీమ్ అభిప్రాయపడుతుంది. ఇదే విషయాన్ని తాజాగా మనోజ్ లేవనెత్తారు.
రీరిలీజ్ చిత్రాలపై మనోజ్ ఆవేదన..
మంచు మనోజ్ 'భైరవం' చిత్రానికి ఖలేజా రీరిలీజ్ ఎఫెక్ట్ పడిందన్నారు. సినిమా పెద్దలు ఈ విషయాన్ని గుర్తించాలని భైరవం రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మాట్లాడారు. తప్పకుండా స్టార్ హీరోల సినిమాల రీరిలీజ్ లకు గట్టి క్రేజ్ ఉంటుంది. అయితే అప్పటికే ఏడాది పొడగునా పండగలు, సెలవులు, ప్రత్యేకమైన డేట్లను స్టార్ హీరోలే లాక్ చేసుకుంటున్నారు. ఇక రీరిలీజ్ ల విషయంలోనూ తమ లాంటి చిన్న సినిమాలు విడుదలయ్యే సమయంలోనే వస్తున్నారు. ఇలాగైతే నష్టపోయే అవకాశం ఉంది. ఈ రీరిలీజ్ ల విషయంలోనైనా పెద్ద కాస్తా పునరాలోచించాలని కోరారు.
మనోజ్ రాబోయే చిత్రాలు..
చాలా గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా భైరవం చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు. ఇక నెక్ట్స్ తెజా సజ్జా నటిస్తున్న 'మిరాయ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సెప్టెబర్ 26న విడుదల కానుంది. అలాగే రక్షక్, వాట్ ది ఫిష్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











