హారర్ కామెడీగా బ్లాక్డ్.. టైటిల్, లోగోకు సూపర్ రెస్పాన్స్
థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ పతాకంపై రామ్ లొడగల దర్శకత్వంలో పద్మలెంక నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ బ్లాక్డ్. మనోజ్ నందం, శ్వేత సాలూరు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ కాగానే విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఈ క్రమంలో బ్లాక్డ్ మూవీ ఫస్ట్‌లుక్, టైటిల్ లోగోను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ లొడగల మాట్లాడుతూ బ్లాక్డ్ మూవీ ఫస్ట్‌లుక్ టైటిల్‌లోగో విడుదల చేయడం హ్యాపీగా ఉంది. థ్రిల్లింగ్ అంశాలు, హారర్ కామెడీ జోనర్‌తో అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సహకారంతో మూవీ ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. అలాగే మా నిర్మాత పద్మలెంక రాజీ పడకుండా సినిమాని రిచ్ లోకేషన్స్‌లో తెరకెక్కించడానికి తోడ్పడ్డారు. బ్లాక్డ్ మూవీ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా అవుతుంది. త్వరలోనే టీజర్, పాటలని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

నటీనటులు: మనోజ్ నందం, శ్వేత సాలూరు, శేకింగ్ శేషు, ఎఫ్ఎమ్ బాబాయ్, టీఎన్నాఆర్, సత్య శ్రీ,, మెహబూబ్ భాషా, వినయ్ మహదేవ్, రామారావు లెంక, శ్రీనివాసరాజు, గుండు మురళి, దివ్య, పద్మావతి, శ్రీవల్లి సాలూరు, లక్ష్మన్ సాలూరు తదితరులు
సినిమాటోగ్రఫి: వెంకటేష్ కే
సంగీతం: ప్రదీప్ చంద్ర
ఎడిటర్: సోమేష్ మూత
ఆర్ట్: ఈశ్వర్
విఎఫ్ఎక్స్: జీవన్ జీఆర్
గాయకులు: సాయి చరణ్, స్పూర్తి జితేందర్
కో-డైరెక్టర్: సాయి జానేశ్వర్
కో- ప్రొడ్యూసర్: రామారావు లెంక
నిర్మాత: పద్మ లెంక
దర్శకత్వం: రామ్ లొడగల


Click it and Unblock the Notifications











