Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోడీ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ విడుదల చేసిన 'మనోవిరాగి'
ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ నడుతోంది. దేశంలోని అత్యున్నత వ్యక్తుల జీవిత కథలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీ జీవితకథతో ఓ బయోపిక్ విడుదల కాగా ఇప్పుడు మరో బయోపిక్ రూపొందించేందుకు ముందుకొచ్చారు బడా నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ.
సంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌ను సంజయ్ లీలా భన్సాలీ, మహావీర్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మన్ బైరాగి అనే టైటిల్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని తెలుగులో మనోవిరాగి అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 17) నరేంద్ర మోడీ బర్త్ డే పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం.
మనో విరాగి తెలుగు, హిందీ వెర్షన్స్ పోస్టర్ని తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రభాస్.. ప్రత్యేకమైన వ్యక్తి చేత ప్రత్యేకమైన వ్యక్తిపై రూపొందుతోన్న ప్రత్యేకమైన సినిమా ఇది. దీనిని ఈ ప్రత్యేకమైన రోజున అనౌన్స్ చేశారు. హ్యాపీ బర్త్ డే నరేంద్రమోదీగారు. సంజయ్ లీలా భన్సాలి, మహావీర్ జైన్ నిర్మిస్తోన మన్ బైరాగి ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను'' అని ప్రభాస్ పోస్ట్ చేశారు.
ఒక సాధారణ కుర్రాడి నుంచి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.