Mansoor Ali Khan: చిరంజీవిపై మన్సూర్ అలీ ఫైర్.. ఆ స్టార్ హీరోయిన్లతో మెగాస్టార్ పార్టీ అంటూ..!

మన్సూర్ అలీ ఖాన్.. ఈ పేరు గతం వారం రోజులుగా తెగ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ త్రిష కృష్ణన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆపై అదంతా పెద్ద చర్చకు దారి తీయడం గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లిన మన్సూర్ అలీ ఖాన్.. ఆ తర్వాత త్రిషకు సారీ చెప్పడం, ఆమెకు ఆమె కూడా స్పందించడంతో గొడవ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ తాజాగా ఆయన మరో గొడవను ముందేసుకున్నారు. రెండు రోజుల క్రితమే.. త్రిషకు సపోర్ట్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూలపై కేసును పెడతానంటూ కూడా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అయితే తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్లు చేసి మరో గొడవకు ఆజ్యం పోశాడు. అసలు ముందు నుంచి ఏం జరిగింది.. త్రిషతో జరిగిన గొడవలోకి చిరంజీవిని ఎందుకు లాగాడు, ఇప్పుడు ఆయనపై ఏమేం కామెంట్లు చేశారనేది మనం ఈ స్టోరీలో చూద్దాం. మన్సూర్ అలీ ఖాన్ ఇటీవలే విజయ్ దళపతి హీరోగా వచ్చిన లియో సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. అయితే అదే చిత్రంలో హీరోయిన్ గా చేసిన త్రిషతో నతకు రేప్ సీన్ లేదని ఓ సమావేశంలో కామెంట్లు చేశాడు. నవంబర్ 11వ తేదీన ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వారం రోజులు తర్వాత వైరల్ గా మారాయి.

Mansoor Ali Khan Shocking Comments on Mega Star Chiranjeevi Check Details

ముఖ్యంగా త్రిష... తనపై మన్సూర్ అలీ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆమె పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది నటులు దానికి స్పందించారు. ఆయన అలా మాట్లాడి ఉండకూడదంటూ ముఖ్యంగా... చిరంజీవి, ఖుష్బూ, నితిన్, మాళవికా మోహనన్ వంటి హీరోహీరోయిన్లు కామెంట్లు చేశారు. ఈ విషయం తెలుుకున్న జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించిన సుమోటోగా కేసును స్వీకరించింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్లిన మన్సూల్ అలీ ఖాన్.. త్రిష కృష్ణన్ కు సారీ చెప్పాడు. ఆ తర్వాత రోజే త్రిష కూడా స్పందిస్తూ.. మన్సూర్ సారీని యాక్సెప్ట్ చేసింది. ఇక గొడవ అంతా ముగిసిందని అంతా అనుకున్నారు.

కానీ తర్వాత రెండ్రోజులకే షాకిస్తూ... మన్సూర్ అలీ ఖాన్ మరో గొడవకు తెర తీశాడు. ముఖ్యంగా చిరంజీవి, ఖుష్బూలపై కేసులు పెట్టబోతున్నట్లు వెల్లడించాడు. పది రోజుల పాటు ప్రజాశాంతికి విఘాతం కల్పిచడంతో పాటు, వ్యభిచారానికి ప్రేరేపిస్తూ అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొనబోతున్నట్లు వెల్లడించారు. కావాలనే కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి ఇంత పెద్ద గొడవ చేశారని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఆయన మరోసారి మెగాస్టార్ చిరంజీవిపై షాకింగ్ కామెంట్లు చేశారు.

Mansoor Ali Khan Shocking Comments on Mega Star Chiranjeevi Check Details

ఏడాదికి ఒకసారి ఓల్డ్ హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి పార్టీలు చేసుకుంటారని మన్సూర్ అలీ ఖాన్ మండిపడ్డారు. వాళ్లతో వీళ్లతో పార్టీలు చేసుకునేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ.. కానీ నాలాంటి వాళ్లకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అని అడిగే సమయం ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత హీరోయిన్లతో పాటు తెలిసిన ఆడ వాళ్లకు మాత్రమే మెగాస్టార్ ఫోన్ చేస్తారంటూ చెప్పుకొచ్చారు. కనీసం తాను ఆయనతో నటించి విషయం గుర్తు తెచ్చుకని అయినా ఏం జరిగిందని ఓసారి ఫోన్ చేస్తే అయిపోయేదానికి ఇంత పెద్ద గొడవ అవసరమా అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మన్సూర్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X