బిగ్‌బాస్ ఇంటిలో అతిథుల సందడి.. ఎగిరిగంతేసిన సెలబ్రిటీలు
బిగ్‌బాస్ ఇంటిలో వారాంతంలో అతిథులు సందడి చేశారు. మను చిత్రంలోని హీరోయిన్ రాజా గౌతమ్, హీరోయిన్ చాందినీ చౌదరీ బిగ్‌బాస్ ఇంటిని సందర్శించారు. మను చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 7) రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్ కోసం బ్రహ్మనందం కుమారుడైన గౌతమ్, హీరోయిన్‌తో కలిసి వచ్చారు.
ఇంటి సభ్యులందరినీ పలుకరించారు. బిగ్ బాస్ సెలబ్రిటీలను నుంచి వారి అనుభవాలను అడిగి తెలుసుకొన్నారు. మను సినిమా గురించి వెల్లడించారు. ఇంటిలో వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. ఇంటి మొత్తం కలియదిరిగారు.

బిగ్‌బాస్ షోను ఆసక్తిగా చూస్తున్నామని, బయట ఈ కార్యక్రామానికి మంచి ఆదరణ ఉందని రాజా గౌతమ్ చెప్పారు. మను సినిమాకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నదని చెప్పారు.
దాదాపు గంటకుపైగా ఇంటిలో గడిపిన తారలు అనంతరం బిగ్‌బాస్ కోరిక మేరకు అక్కడి నుంచి నిష్క్రమించారు. మను చిత్రం గొప్ప విజాయాన్ని అందుకోవాలని బిగ్‌బాస్ ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











