నిహారిక-నాగ శౌర్యపై పెళ్లి రూమర్స్... ఇన్‌స్టాలో ఆ కామెంటే కారణం!

Recommended Video

Naga Shaurya Breaks Silence On Wedding Rumours With Niharika!! | Filmibeat Telugu

మెగా డాటర్ నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ శౌర్య హీరోగా నటించాడు. ఇద్దరూ కలిసి నటించడంతో అప్పటి నుంచి వీరికి లింకప్ పెడుతూ తరచూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో వీరు డేటింగ్ చేస్తున్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాగా నాగ శౌర్య ఖండించాడు.

తాజాగా మరోసారి నాగ శౌర్య, నిహారిక మీద రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మళ్లీ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు రావడానికి కారణం నాగ శౌర్య తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోపై కామెంట్ చేయడమే.

నాగ శౌర్య

నాగ శౌర్య

నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో బాబు ఎత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. మా ఇద్దరిలో ఎవరు క్యూట్‌గా ఉన్నారో చెప్పండి? అని కోరగా.... కామెంట్ బాక్సులోకి నాగశౌర్య ఎంటరై ‘మీ ఇద్దరికీ దిష్టి తీయాలి' అంటూ వ్యాఖ్యానించారు. దీంతో నిహారిక-నాగ శౌర్యపై పెళ్లి రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి.

నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని చెప్పిన శౌర్య

నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని చెప్పిన శౌర్య

తమపై వస్తున్న రూమర్లను నాగ శౌర్య ఖండించారు. ‘నేను, నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదు. మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదు. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసిన ఇలా ప్రచారం జరుగుతుందని చెప్పగానే షాకయ్యాను. అందుకే ఈ వార్తలకు ముగింపు పలకాలనుకుంటున్నా. నిహారికపై ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. నేను ఏ హీరోయిన్ తోనూ డేటింగ్ చేయడం లేదు' అని నాగ శౌర్య స్పష్టం చేశారు.

నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల 2016లో ‘ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇప్పటి వరకు మూడు తెలుగు సినిమాలతో పాటు ఒక తమిళ చిత్రంలో నటించింది. ఏ సినిమా కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. నిహారిక చివరగా నటించిన ‘సూర్యకాంతం' కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

నాగ శౌర్య

నాగ శౌర్య

‘ఛలో' సినిమా తర్వాత నాగ శౌర్య కూడా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారు. అతడు నటించిన అమ్మమ్మగారిల్లు, నర్తనశాల చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం అతడు నటించిన ‘ఓ బేబీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సమంత మెయిన్ రోల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X