హీరో కూడా మీతో పడుకోవాలా?.. నిర్మాతకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ శృతి!

క్యాస్టింగ్ కౌచ్ పై ఎన్ని వివాదాలు వస్తున్నా కూడా ఇంకా వాటి డోస్ తగ్గడం లేదు. నిత్యం ఎవరో ఒకరు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నారు. హీరోయిన్స్ చాలా వరకు ఈ భయంకర విషయం గురించి ధైర్యంగా భయటపెడుతున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ శృతి మరాతే కూడా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరణ ఇచ్చింది.

ఇప్పటిది కాదు..

ఇప్పటిది కాదు..

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటిది కాదు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నదే. క్యాస్టింగ్ కౌచ్ నిర్ములన కోసం సినిమా పెద్దలు స్పెషల్ గా కమిటీ వేసినప్పటికి వివాదాలు తగ్గడం లేదు. ఆ మధ్య మీటూ దెబ్బకు చాలా వరకు సినిమా ఇండస్ట్రీలలో చీకటి రహస్యాలు బయటపడ్డాయి. చాలా మంది నటీమణులు ఇండస్ట్రీలోని చీకటి బాగోతాలను కూడా బయటపెట్టారు.

ఒప్పుకొకపోతే..

ఒప్పుకొకపోతే..

స్టార్ హీరోయిన్ అవ్వాలని కొత్తగా అడుగులు వేసే ప్రతి హీరోయిన్ కి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ముళ్ల దారిలా మారింది. అవకాశాలు రావాలంటే కొంతమంది చెప్పినట్లు క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో ఇరుక్కోవాల్సిందే అన్నట్లు టాక్ వస్తోంది. ఒప్పుకుంటే కోట్లలో ఆదాయాన్ని ఇచ్చే అవకాశాలు వస్తాయట. లేకుంటే చిన్న అవకాశాలు కూడా మిస్ అవుతాయని కొంతమంది నటీమణులు మీటూ ఉద్యమంలో బయటపెట్టారు.

కౌంటర్ ఇచ్చిన శృతి..

కౌంటర్ ఇచ్చిన శృతి..

మరాఠీ హీరోయిన్ శ్రుతి మరాతె కూడా ఇలాంటి అనుభవమే ఎదురైతే నిర్మాతకు ఎవరు ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చిందట. సాధారణంగా శృతి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడం అలవాటుగా చేసుకుందట. అయితే ఒక సినిమాకు ఒప్పుకునే ముందు ప్రొడ్యూసర్ ప్రతిసారి చిరాకు పెడుతుంటే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిందట.

Recommended Video

Shruti Haasan Serious On Male Dominance In Industry || హీరోలు పై నుంచి ఊడిపడ్డారా?
హీరో కూడా పడుకోవాలా..

హీరో కూడా పడుకోవాలా..

"కాంప్రమైజ్ అవ్వాలి, ఒకరాత్రి పడుకోవాలని నిర్మాత చెప్పడంతో నాకు చిరాకు వచ్చేసింది. వెంటనే నేను..హీరోని కూడా ఇలానే అడిగావా..? అతను కూడా పడుకోవాలా.. అలా అయితేనే మీ సినిమాలో అవకాశం ఇస్తావా" అని శృతి అతనికి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చిందట. అయితే అలా సమాధానం ఇవ్వడంతో ఆ సినిమా నుంచి తనను తప్పించినట్లు చెబుతూ.. అందుకు నేను బాధపడటం లేదు.. ఇలాంటి విషయాలలో ధైర్యంగా ఉండి మన విలువల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే చెప్పినట్లు శృతి వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X