13న వస్తున్న ‘మార్షల్’... శ్రీకాంత్ పాత్ర కీలకంగా!

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం 'మార్షల్'. హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్‌లో నిర్మించగా, జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

"కెజిఎఫ్" చిత్రానికి సంగీతం అందించిన రవి బసురి 'మార్షల్' కథ నచ్చడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సినిమాకు రీ రికార్డింగ్, 2 పాటలను సమకూర్చినట్లు చిత్ర బృందం తెలిపింది. RX 100 సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన శివమ్ సెల్యూలాయిడ్స్ సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని 300 థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నారు.

Marshall releasing on Sep 13th

హీరో అభయ్ అడకా పోషించిన పాత్ర ఎంతో హుందాగా, సరికొత్తగా ఉంటుందని, శ్రీకాంత్ పోషించిన పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని, ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.

ఈ చిత్రంలో అభయ్, శ్రీకాంత్, మేఘా చౌదరి, రష్మి సమాంగ్, సుమన్, వినోద్ కుమార్, శరణ్య, పృద్విరాజ్, రవి ప్రకాష్, ప్రియ దర్శిని రామ్, ప్రగతి, కల్ప వల్లి, సుదర్శన్, తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : కె.జీ.ఎఫ్ ఫేమ్ రవి బసురి, ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్యమ్, మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,ఫైట్స్ : నాభ మరియు సుబ్బు, ఎడిటర్ : చోట కె ప్రసాద్, పాటలు : యాదగిరి వరికుప్పల, కళా దర్శకుడు : రఘు కులకర్ణి, డాన్స్ మాస్టర్ : గణేష్, ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ, నిర్మాత : అభయ్ అడకా, దర్శకత్వం: జై రాజాసింగ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X