Baby డైరెక్టర్ సాయి రాజేశ్‌కు ఖరీదైన కారు.. సినిమా రిలీజ్‌కు ముందే మారుతి సర్‌ప్రైజ్ గిఫ్టు
సాధారణంగా ఓ దర్శకుడు హిట్ కొడితే.. సంతోష పడే నిర్మాతలు ఏదో గిఫ్టును ఇవ్వడం సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తుంటుంది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే దర్శకుడు సాయి రాజేశ్‌కు నిర్మాతలు ఎస్కేఎన్, మారుతి ఖరీదైన కారును బహుకరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ ఆసక్తికరమైన వార్త వివరాల్లోకి వెళితే..
దర్శక నిర్మాత సాయి రాజేశ్ తాజాగా బేబీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, విజయ్ అశ్విన్, వైష్ణవీ చైతన్య తదితరులు ఈ సినిమాలో నటిస్తు్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శక, నిర్మాత మారుతి, నిర్మాత ఎస్కేన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బేబీ చిత్రం విభిన్నమైన కథతో న్యూఏజ్ లవ్ స్టోరీగా రూపొందుతున్నది. ఈ సినిమా శరవేగంగా షూటింగు జరుపుకొంటూ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే.. అంచనాలు పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్, టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అలాగే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించేందుకు ప్లాన్ చేశారు.
దర్శకుడు సాయి రాజేశ్ బేబీ సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్న విధానం చూసి ఇంప్రెస్ అయిన మారుతి, ఎస్కేఎన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎంజీ హెక్టర్ లగ్జరీ కారును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. మారుతి, ఎస్కేఎన్ ఇచ్చిన గిఫ్టు విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సాయి రాజేశ్ విషయానికి వస్తే.. ఇటీవల కలర్ ఫోటో సినిమాతో జాతీయ అవార్డును అందుకొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఎస్కేఎన్ విషయానికి వస్తే.. ఈ రోజుల్లో, టాక్సీవాలా, మంచిరోజులొచ్చాయి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











