మారుతి కొత్త సినిమా అతడితోనేనా.. విజయ్ దేవరకొండ బిజీ!
దర్శకుడు మారుతి కామెడీ, వినోదాత్మక చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మారుతీ గత ఏడాది తెరకెక్కించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం నిరాశ పరిచింది. దీనితో మారుతి తన తదుపరి చిత్రంపై ద్రుష్టి పెట్టాడు. ఆ మధ్యన అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి మారుతి ప్రయత్నించారు. కానీ బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వం వైపే మొగ్గు చూపాడు.
ఇక మరో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కోసం కూడా మారుతి ఓ కథ సిద్ధం చేసుకున్నాడట. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ కొందరు దర్శకులతో చేయడానికి కమిటై ఉండడంతో మారుతికి అవకాశం దక్కలేదు. దీనితో మారుతి హీరో శర్వానంద్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారట.

వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మహానుభావుడు లాంటి హిట్ చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో శర్వానంద్ అతిగా పరిశుభ్రతని ఇష్టపడే వ్యక్తిగా చూపించి వినోదాన్ని పంచారు. సింపుల్ స్టోరీకి మంచి కామెడీ జోడించి విజయాలు అందుకోవడం మారుతి శైలి. ఈ సారి మారుతి ఎలాంటి కథతో రాబోతున్నాడో చూద్దాం!


Click it and Unblock the Notifications











