ప్రభాస్ ఫ్యాన్స్ వెర్రెక్కిపోయే న్యూస్.. ముందే లీక్ చేసిన డైరెక్టర్

టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో అయినా సినిమా చేయాలంటే ఏడాది కంటే ఎక్కువగానే సమయం పడుతుంది. కానీ, కొందరు బడా హీరోలు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కొంత కాలంగా భారీ భారీ చిత్రాలను చేస్తూ పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తోన్న అతడు.. ఈ మధ్య రెట్టించిన ఉత్సాహంతో వెళ్తున్నాడు.

'సలార్: సీజ్‌ఫైర్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కిన రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో వచ్చాడు. ఇది రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ జోష్‌లోనే ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' చిత్రాన్ని చేస్తున్నాడు.

Maruthi Gives Clarity On Prabhas Starrer The Raja Saab Movie Teaser

రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న 'ది రాజా సాబ్' సినిమా హర్రర్ కామెడీ కాన్సెప్టుతో రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాకుండానే షూటింగ్‌ను చిత్ర యూనిట్ సీక్రెట్‌గా స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి పలు షెడ్యూళ్లను జరుపుకుని చాలా వరకూ షూట్ కంప్లీట్ చేసుకుంది. అలా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా జరుపుతోంది.

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి అప్పుడప్పుడూ కొన్ని అప్‌డేట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి 'ఫ్యాన్ ఇండియా గ్లింప్స్' వీడియో విడుదలైంది. దీనికి ప్రభాస్ అభిమానులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు వెర్రెక్కించే వార్త చెప్పాడు.

తాజాగా వచ్చిన 'ది రాజా సాబ్' సినిమా గ్లింప్స్‌ను డైరెక్టర్ మారుతి X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయగా.. దానికి ఓ అభిమాని 'ఒక డైలాగ్ పెట్టొచ్చు కదా అన్నా' అని అడిగాడు. దీనిపై స్పందించిన డైరెక్టర్ మారితి 'అవన్నీ టీజర్‌లోనే' అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా టీజర్‌పై అంచనాలు పెంచేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందుతోన్న 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X