Maruthi Nagar Subramanyam Tralier Review: సుబ్రమణ్యం ఎటకారానికి పరాకాష్ట.. డైలాగ్ డెలివరీతో దంచికొట్టిన రావు

తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటుడు రావు రమేష్ ఎలాంటి పాత్రనైనా అద్బుతంగా తన మార్క్ నటనతో పండించడమేనేది అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకొన్నారు. ఆ ముద్రను మరింత బలంగా మార్చుకొనేందుకు సరికొత్త పాత్ర, అవతారంలో ఆయన మారుతీ నగర్ సుబ్రమణ్యం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రిలీజ్‌కు ముందే అందరిని ఆకట్టుకొంటున్న ఈ సినిమా ట్రైలర్ విశేషాల్లోకి వెళితే..

మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా విషయానికి వస్తే.. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్ సరసన ఇంద్రజ, అంకిత్ కోయా, రమ్య పసుపులేటి, హర్షవర్గన్ నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రాంచరణ్ రిలీజ్ చేశారు.

Maruthi Nagar Subramanyam Tralier Review Rao Ramesh mesmerizes with Comedy Timing

రావు రమేష్, శివన్నారాయణపై ట్రైలర్ ఓపెన్ కాగా.. పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది' అని శివన్నారాయణ అడిగితే... గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను అని రావు రమేష్ సైటైర్‌తో సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత భార్య ఇంద్రజ సిగరెట్ ప్యాకెట్లన్నింటిని దొరకపట్టుకొని.. ఇక నుంచి నీకు సిగరెట్ల ఖర్చకు డబ్బులు ఇవ్వను అంటుంది.. దాంతో ఆ పక్కనే ఉన్న అన్నపూర్ణమ్మ.. నీకు అదృష్టం ఆవకాయంత ఉంటే.. దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు అంటుంది.

ఇక అంకిత్ కోయా, రమ్య పసుపులేటి మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు యూత్‌కు గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. తన ప్రేయసిని మెప్పించడానికి మా నాన్న అల్లు అరవింద్ అంటూ అబద్దాలు చెప్పడమనేది ఆసక్తికరంగా కనిపించింది. ఇక తండ్రి రావు రమేష్‌తో కొడుకు అంకిత్.. డీఎన్ఏ టెస్ట్ చేయించు అంటే.. ఈడ్చి కొడితే ఈఎన్‌టీ టెస్ట్‌కు వెళ్తావు అనేది ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాయి.

Maruthi Nagar Subramanyam Tralier Review Rao Ramesh mesmerizes with Comedy Timing

రమ్య తన ప్రియుడితో మాట్లాడుతూ.. మా మమ్మీ అయితే స్క్రిన్ ఆఫ్ రా కొట్టేస్తుందంటూ చెప్పే డైలాగ్ సినిమాలో కామెడీకి భారీగా పెద్ద పీట వేశారనే విషయం ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. తండ్రి అప్పుల్లో కూరుకుపోవడం.. డబ్బు కోసం తండ్రి కొడుకులు వేసిన డ్రామాలు ట్రైలర్‌లో కేకపెట్టించాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్లలో మూవీని ఎప్పుడెప్పుడూ చూద్దామా అనే క్యూరియాసిటీని డబుల్ చేసింది.

ఫన్, కామెడీ, ఎమోషన్స్, నటీనటులు హై రేంజ్ ఫెర్ఫార్మెన్స్‌ను ట్రైలర్ ద్వారా రుచి చూపించిన ఈ సినిమా పండగ పూట పంచభక్ష పరమాన్నంలా ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. తనదైన శైలిలో డైలాగ్స్‌తో ఆకట్టుకొనే రావు రమేష్ ఈ చిత్రంలో డైలాగ్ డెలివరీతో చెలరేగిపోయాడు. ఈ తండ్రి కొడుకుల మ్యాజికల్ సైటిరిక్ డ్రామాను ఆగస్టు 23వ తేదీన చూడాల్సిందే. మారుతి నగర్ సుబ్రమణ్యం కొత్త అనుభూతిని కలిగిస్తుందనే ఫీలింగ్ మాత్రం ట్రైలర్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.

నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు
సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి
ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
పీఆర్వో: పులగం చిన్నారాయణ
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి
క్రియేటివ్ హెడ్: గోపాల్ అడుసుమిల్లి
సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల
సమర్పణ: తబితా సుకుమార్
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X