ప్రతిరోజు పండగేపై వస్తోన్న వార్తలు అబద్దం.. అసలు స్టోరీ ఇదే.. మారుతి కామెంట్స్
ఒకప్పుడు బూతు చిత్రాలను తీసి విమర్శల పాలయ్యాడు దర్శకుడు మారుతి. ఎప్పుడైతే రూట్ మార్చి అడల్డ్ కామెడీ జోలికి పోకుండా రూటు మార్చేసి.. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చాడో మారుతిపై పడ్డ మచ్చ పోతూ వస్తోంది. అయితే గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక వెనుకబడ్డ మారుతి.. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రతీరోజు పండగే చిత్రాన్ని చేస్తున్నాడు.
సాయిధరమ్ తేజ్ .. రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా, డిసెంబర్ 20వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, పాటలతో మంచి హైప్ క్రియేట్ అవ్వగా.. చిత్రబృందం ఫుల్ ఖుషీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథపై మీడియాలో వస్తోన్న వార్తలపై దర్శకుడు స్పందించాడు.

ఈ సినిమాలో హీరో ఊరును బాగు చేయడానికి పల్లెటూరుకి వస్తాడనీ, తండ్రినీ .. తాతను కలపాలనే ఉద్దేశంతో వస్తాడని .. ఇలా ఎవరికి తోచింది వాళ్లు రాస్తున్నారని మారుతి ఫైర్ అయ్యాడు. నిజానికి అలాంటి పాయింట్‌తో తాను ఈ సినిమా చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఒక మనిషి పుట్టుకను కుటుంబ సభ్యులు ఎలా సెలబ్రేట్ చేస్తారో, చనిపోయినప్పుడు బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించానని పేర్కొన్నాడు. ఇంతవరకూ ఇలాంటి కాన్సెప్టును ఎవరూ టచ్ చేయలేదని, ఈ కథ చిరంజీవిగారికి కూడా చాలా బాగా నచ్చిందని, హిట్ అవుతుందనే నమ్మకం వుందని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











