twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiru154: మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్.. పాత రోజులు గుర్తు చేసేలా చిరంజీవి

    |

    బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అన్నింటికీ మించి ప్రత్యేకమైన గ్రేస్‌తో తక్కువ సమయంలోనే సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభంలోనే బడా హీరోల పోటీని తట్టుకుని నిలబడిన ఆయన.. స్టార్‌గా ఎదిగిపోయారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్లారు. ఇలా సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన చిరంజీవి.. కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకుని 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత 'సైరా: నరసింహా రెడ్డి' అనే సినిమా చేశారు. ఇవి అనుకూలమైన ఫలితాలను ఇవ్వకున్నా ఈ మెగా హీరోలో కాన్ఫిడెన్స్‌ను మాత్రం భారీగా పెంచాయి. దీంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.

    దారుణమైన ఫొటోలు వదిలిన రష్మిక: హాట్ ట్రీట్‌లో హద్దు దాటేసిందిగా!దారుణమైన ఫొటోలు వదిలిన రష్మిక: హాట్ ట్రీట్‌లో హద్దు దాటేసిందిగా!

    ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు నిరాశే మిగిలింది. ఫలితంగా ఈ మూవీకి రూ. 80 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం చిరంజీవి చేస్తోన్న చిత్రాల్లో ఒక 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి 'భోళా శంకర్'. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు దాదాపుగా పూర్తైన విషయం తెలిసిందే.

    చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరొందిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో ఓ ప్రాజెక్టు ఉంది. మెగాస్టార్ 154వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. అంతేకాదు, పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జూలై 13 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇందులో చాలా సన్నివేశాలతో పాటు ఓ సాంగ్‌ను కూడా షూట్ చేయబోతున్నారని తాజాగా తెలిసింది.

    శివాత్మిక రాజశేఖర్ అందాల ఆరబోత: డార్క్ రూమ్‌లో స్లీవ్‌లెస్ టాప్‌తో!శివాత్మిక రాజశేఖర్ అందాల ఆరబోత: డార్క్ రూమ్‌లో స్లీవ్‌లెస్ టాప్‌తో!

    Mass Intro song for Chiranjeevi in Bobby Movie

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా చిరంజీవిని పక్కా మాస్ రోల్‌లో చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ. అంతేకాదు, ఈ చిత్రంలో ఆయన కోసం ఓ మాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను కూడా పెడుతున్నారట. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేసేసి రికార్డింగ్ కూడా పూర్తి చేశారట. ఈ సాంగ్ చిరంజీవి పాత చిత్రాలను గుర్తు చేసేలా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక, దీనికి సంబంధించిన షూటింగ్‌ను జూలై 16, 17 తేదీల్లో జరపబోతున్నారని తెలిసింది. ఇందుకోసం ప్రముఖ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్‌ను వేశారని అంటున్నారు. దీంతో ఈ సాంగ్‌పై అంచనాలు నెలకొన్నాయి.

    మెగాస్టార్ చిరంజీవి - కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేస్తున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది.

    English summary
    Megastar Chiranjeevi Now Doing Valtheru Veeraiah Movie Under K. S. Ravindra Direction. Mass Intro song for Chiranjeevi in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X