Ravanasura Trailer: వీడు చాలా డేంజర్.. జోకర్ తరహాలో యాక్షన్ డోస్ పెంచిన రవితేజ!
మాస్ మహారాజ రవితేజ ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేశాడు. అయితే ఈసారి మాత్రం రావణాసుర సినిమా అంతకుమించి డిఫరెంట్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఈ సినిమాలో యాక్షన్ త్రిల్లర్ సీన్స్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. రావణాసుర సినిమా ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

మరో యాక్షన్ త్రిల్లర్
మాస్ మహారాజా రవితేజ ఏ సినిమా చేసినా కూడా అందులో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి అని చాలాసార్లు రుజువు చేసాడు. ఇక ధమాకా వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుసగా సక్సెస్ అందుకున్న రవితేజ ఈసారి రావణాసుర అనే మరో యాక్షన్ త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరో సుశాంత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మొదట్లోనే..
రావణాసుర సినిమా ట్రైలర్ వివరాల్లోకి వెళితే.. మొదట్లోనే ఈ సినిమా యాక్షన్ ఎలెమెంట్స్ హై లెవెల్ లో ఉన్నట్లుగా క్లారిటీ ఇచ్చేశారు. రవితేజ కెరీర్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా గన్ షాట్స్ తో పాటు పవర్ఫుల్ ఫైట్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుధీర్ వర్మ కూడా ఈసారి ఊహించని కరహాలో రవితేజను ప్రజెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

లాయర్ పాత్రలో..
అయితే కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ పాటు కూడా సినిమాలో ఉండబోతున్నట్లు మరికొన్ని సీన్స్ తో వివరణ ఇచ్చేశారు. ఇక హైపర్ ఆది రవితేజ కాంబినేషన్లో కూడా కొన్ని కామెడీ సీన్స్ హైలైట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే సినిమాలో అను ఇమాన్యుయల్ ఫారియా అబ్దుల్లా, మెగా ఆకాష్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

మర్డర్ మిస్టరీ
ఇక మర్డర్ మిస్టరీ నుంచి ఈ సినిమా కథ ఊహించని మలుపు తిరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. రవితేజ లాయర్ గా ఆ కేసును ఎలా టేకప్ చేశాడు.. అలాగే తనలోని రావణాసుర కోణాన్ని ఎలా బయటపెట్టాడు అనేది కూడా సినిమాలో మరింత హైలెట్ అవుతున్నట్లుగా ప్రజెంట్ చేశారు. ఇక రవితేజ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఇందులో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

వాడు చాలా డేంజర్
వాడు క్రిమినల్ లాయర్ కాదు. లా చదివిన క్రిమినల్ అంటూ రవితేజ క్యారెక్టర్ కు అర్థం పట్టేలా ఉన్న డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా రావు రమేష్ మొదటిసారి ఈ సినిమాలో పూర్తిస్థాయిలో తెలంగాణ భాషలో మాట్లాడబోతున్నట్లు చూపించారు. వాడు చాలా డేంజర్ గాని లెక్క ఉన్నాడు అంటూ ఆయన చెప్పిన టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది.
దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్
మరొక సీన్ లో మర్థర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్. ఐయామ్ అన్ ఆర్టిస్ట్.. రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ.. అంటూ రవితేజ విలన్ షేడ్ తో చెప్పినా డైలాగ్ కూడా హైలెట్ అవుతోంది. అలాగే జోకర్ షెడ్ లో చెప్పిన డైలాగ్ కూడా పవర్ఫుల్ గా ఉంది. ఈ భూమి మీద నన్ను ఆపగలిగే వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది నేనే అంటూ రవితేజ తనలోని రావణాసురకోణాన్ని ఒక డైలాగ్ తో మరింతగా అంచనాలను క్రియేట్ చేశాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











