Mr Bachchan Show Reel Review: మాస్, యాక్షన్‌తో రవితేజ ఊచకోత.. హరీష్ శంకర్ ఏ మాత్రం తగ్గలేదుగా!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం మిస్టర్ బచ్చన్. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్న ఈ సినిమా రిలీజ్ సిద్దమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా షో రీల్ అంటూ ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ షో రీల్ వివరాల్లోకి వెళితే..

వాస్తవనానికి రవితేజతో హరీష్ శంకర్ సినిమా ప్లానింగ్‌లో లేదు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పవన్ కల్యాణ్ ఎన్నికల వ్యూహం, ప్రచారంలో బిజీ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా వేశారు. ఆ సమయంలోనే మిస్టర్ బచ్చన్ సినిమా ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.

Mass Maharaj Ravi Teja s Mr Bachchan s Show Reel Review Here is complete analysis

ఇక మిస్టర్ బచ్చన్ సినిమాను రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో అతి వేగంగా షూటింగు జరుపుకొన్న సినిమాగా చెప్పుకొంటున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్ సినిమాను హరీష్ తనదైన శైలిలో రవితేజ మాస్ ఎలిమెంట్స్ ఇక్కడ మిస్ కాకుండా తీసిన సినిమాగా షో రీల్ కనిపించింది.

మిస్టర్ బచ్చన్ షో రీల్ విషయానికి వస్తే.. తన ఇమేజ్‌కు ఎక్కడా తగ్గకుండా.. మాస్ ఎలిమెంట్స్‌తో మిస్టర్ బచ్చన్‌గా కనిపించబోతున్నట్టు స్పష్టమైంది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగానే కనిపించింది. బచ్చన్ టైటిల్ పెట్టిన తర్వాత ఫైట్స్ లేకపోతే బాగుండదేమోనని రవితేజ యాక్షన్‌, రొమాన్స్, ఎమోషన్స్‌తో బాక్సాఫీస్ ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తున్నది.

Mass Maharaj Ravi Teja s Mr Bachchan s Show Reel Review Here is complete analysis

ఇక మిస్టర్ బచ్చన్ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దడదడ లాడించినట్టు ఎక్కువ కష్టపడకుండానే అర్ధమైంది. ఇక సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దండిగానే కనిపించాయి. రవితేజ, జగపతి బాబు మధ్య హై ఇంటెన్స్ సీన్స్ ఉంటాయనే సంకేతాన్ని కూడా గ్లింప్స్‌లో హరీష్ చెప్పకనే చూపించాడు.


ఇదిలా ఉంటే.. హడావిడిగా మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతున్నది. పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఈ మూవీని రిలీజ్ చేయాలనే ప్లాన్ సడెన్‌గా వచ్చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ఆగస్టు 15 తేదీన ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X