మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
మాస్ మహారాజా రవితేజ మొత్తానికి క్రాక్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా 50కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సంక్రాంతి బెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అయితే నేడు మాస్ రాజా పుట్టినరోజు సందర్భంగా మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన తరువాతి సినిమా 'ఖిలాడి' ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.
రాక్షసుడు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ ఖిలాడి సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మాస్ రాజా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ అభిమానులకు మంచి కిక్కిచ్చింది. యాక్షన్ ఫ్రేమ్ లో మాస్ రాజా చేతిలో సుత్తి పట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపించాడు. చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది.

ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే మాస్ రాజా ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడని తెలిసిపోయింది. చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. క్రాక్ హిట్టుతో ఫామ్ లో ఉన్న మాస్ రాజా అదే ఎనర్జితో ఖిలాడిని రెడీ చేస్తున్నాడు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను A స్టూడియోస్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











