రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఓపెనింగ్‌కు మాస్ మహారాజా డుమ్మా.. ఎందుకంటే?

టాలీవుడ్‌లో హీరోల కుటుంబాల నుంచి వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. ప్రతీ ఏడాది హీరోలు, సినీ ప్రముఖుల కుటుంబాల వారసత్వాన్ని పుచ్చుకొని యువ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ కుమారుడు హిట్ ఖాతాలో వేసుకోగా.. సురేష్ బాబు తనయుడు కూడా అహింస సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా రవితేజ కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్నారు. ఆ హీరో గురించి, అలాగే ఆ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

రవితేజ ఫ్యామిలీ నుంచి

రవితేజ ఫ్యామిలీ నుంచి

టాలీవుడ్‌లో హిట్లతో దూసుకెళ్తున్న మాస్ మహరాజ్ రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనున్నది. పెళ్లి సందD చిత్రంతో కమర్షియల్‌ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

రాఘవేంద్రరావు చేతుల మీదుగా

రాఘవేంద్రరావు చేతుల మీదుగా

రామానాయుడు స్టూడియోస్‌లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డీ సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరుల ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దర్శకులు రాఘవేంద్రరావు చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేశారు. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు.

నిర్మాత రవిచంద్ ఆనందంతో

నిర్మాత రవిచంద్ ఆనందంతో

నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మాట్లాడుతూ .. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్పీలో బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ముహుర్త కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు స్క్రిప్ట్ అందజేయడం, ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టడం ఆనందంగా ఉంది. నిర్మాత సురేష్ బాబు స్విచ్ ఆన్ చేశారు. వారికి కృతజ్ఞతలు అని అన్నారు.

పెళ్లి సందD దర్శకురాలు

పెళ్లి సందD దర్శకురాలు

పెళ్లి సందD మూవీతోనే ప్రూవ్ చేసుకున్న దర్శకురాలు గౌరి రోణంకి రెండో చిత్రాన్ని మా బ్యానర్‌లో చేయడం సంతోషంగా ఉంది. మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు అబ్బాయి మాధవ్‌ను హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా గౌరి గారి పెళ్లి సందD ఫ్లేవర్‌లో కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. మంచి పాయింట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది అని నిర్మాత జె జే ఆర్ రవిచంద్ అన్నారు.

రవితేజ ఎందుకు రాలేదంటే?

రవితేజ ఎందుకు రాలేదంటే?

మాధవ్ తొలి సినిమా ముహుర్త కార్యక్రమానికి షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల రవితేజ ఓపెనింగ్‌కు రాలేకపోయారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తున్న మాధవ్ ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. గతంలో సాంబశివ క్రియేషన్స్ బ్యానర్ లో ఐదు చిత్రాలు చేశాను. జేజేఆర్ బ్యానర్‌లో మొదటి సినిమా నవీన్ చంద్రతో చేశాను. ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో అన్ని క్రాఫ్ట్స్ హైలెట్ కాబోతున్నాయి. టెక్నీషియన్స్ అందరూ ఇప్పటికే పెద్ద సినిమాలు చేసి నిరూపించుకుని ఉన్నారు. మొదటి నుంచి నాకు సపోర్ట్‌గా ఉన్న చదలవాడ శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు థ్యాంక్యూ సో మచ్ అని నిర్మాత అన్నారు.

గౌరీ రోణంకి ఎమోషనల్‌గా

గౌరీ రోణంకి ఎమోషనల్‌గా

దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ .. 'నా తల్లి దండ్రులకు, మా గురువు గారు కే రాఘవేంద్రరావు గారికి థ్యాంక్యూ సో మచ్. ఓ రకంగా ఇది నా సెకండ్ డెబ్యూ మూవీగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువుగారు, సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను.. మా హీరో మాధవ్ ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను.

వారు చెప్పినట్టుగా ఇది చాలా యూత్ ఫుల్ గా సాగే కలర్ ఫుల్ గా ఉండే సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ తో సపోర్ట్ గా నిలుస్తున్నారు అనుకుంటున్నాను. ఇక నా గత చిత్రం లాగానే మీడియా సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.. ' అన్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు

మాధవ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నటించే వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు. కొంతమంది సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తూ..
సాంకేతిక నిపుణులు:
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: రామ్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్: విప్లవ్
పిఆర్వో: జిఎస్కే మీడియా
నిర్మాత: జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం: గౌరి రోణంకి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X