Mega 154: మెగా మాస్ కాంబో రెడీ.. విజిల్ వేసేలా ఎంట్రీ ఇచ్చిన రవితేజ
బాబీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మెగా154 చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించబోతున్నట్లు మొన్నటి వరకు అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గానే ప్రకటించారు. రవితేజ ఈ ప్రాజెక్ట్‌లో మొదట ఒక గెస్ట్ పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ తో వీరి కాంబినేషన్ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి రవితేజ షూట్‌లో చేరాడు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో రవితేజ మాస్ ఫోర్స్‌లో చేరడం హైలెట్ అయ్యింది. దర్శకుడు బాబీలాగే రవితేజ కూడా చిరంజీవికి వీరాభిమాని అందరికి తెలిసిన విషయమే. గతంలో రవితేజ అన్నయ్య సినిమాలో మాస్ రాజా తమ్ముడి పాత్రలో నటించారు.

కారావాన్ లో ఉన్న మెగాస్టార్ ను డోర్ కొట్టి అన్నయ్య పిలిచిన రవితేజ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక మాస్ కాంబో మొదలైంది అని రబితేజ వివరణ ఇచ్చారు. ఇక బ్లాక్ బస్టర్ పవర్ సినిమాతోనే బాబీని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజనే. ఇక దేవి శ్రీ ప్రసాద్ మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆక్సరగొట్టేశారు. మాస్ తో పెట్టుకుంటే అనే సాంగ్ తో పాటు శంకర్ దాదా MBBS పాటలను కుడా మిక్స్ చేస్తూ అద్భుతమైన BGM ఇచ్చారు.
ఈ చిత్రంలో శృతి హాసన్ మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











