రవితేజ చేతుల మీదుగా శింబు మనాడు టీజర్.. 125 కోట్ల భారీ బడ్జెట్‌ మూవీ కోసం మాస్ మహారాజా..

తమిళం స్టార్ హీరో శింబు మరోసారి తన స్టార్ స్టామినా చాటుకొనేందుకు ఓ భారీ చిత్రంతో ముందుకొస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రేంజ్‌లో రూపొందిన చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను అబ్బుర పరిచేందుకు సిద్దమయ్యారు. ఈ చిత్రానికి మాస్ మహారాజ్ తన సహకారం అందించడం ఆసక్తికరంగా మారింది.

క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు".ఈ చిత్రంలో దక్షిణాదిలో స్టార్ హీరో శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రవితేజ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు రవితేజ 'మానాడు' టీజర్ రిలీజ్ చేయనున్నారు.

 Mass Maharaja Ravi Teja to unveil Simbus Manaadu movie teaser

దక్షిణాదిలో ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం 'మానాడు' తెలుగు టీజర్... తాజాగా 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X