రవితేజ కొత్త సినిమాకు హీరోయిన్ దొరికేసిందోచ్.. ఎవరో తెలుసా?

మాస్ మహారాజా రవితేజకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాల్లో చేసే కామెడీ అయినా మాస్ యాక్షన్ అన్నా తెగ ఇష్టపడుతుంటారు జనాలు. ముఖ్యంగా ఈ మధ్య రవితేజ జోరు పెంచారు. సినిమా హిట్టు అయినా ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పటికే ఈయన హీరోగా చేసిన ఈగల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో ప్రాజెక్టును లాక్ చేసేసుకున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు హీరోయిన కూడా దొరికేసింది. ఆమె ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జాతి రత్నాలు సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదీప్... మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే మాస్ మహారాజా రవితేజ కలిసి ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈగల్ విడుదల అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ కూడా చేస్తున్నారట. ఈక్రమంలోనే హీరోయిన్ కోసం వెతుకాలట ప్రారంభించిన ఓ కొత్త బ్యూటీని తొలిసారి తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్.

 Mass maharaja Raviteja Anudeep Combo Movie Heroine Fixed Check Details

రుక్మణీ వసంత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా చాలా బాగా తెలుసు. ఈమె కన్నడలోనే సినిమాలు చేసిన అవి తెలుగులో డబ్ అయ్యాయి. అలా ఆ కన్నడ అందం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సప్త సాగరదాచె ఎల్లో సైడ్ ఎ సినిమాలో ప్రియ గా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఒక్క కడన్నడలోనే కాకుండా మిగతా భాషల వారికి కూడా ఈ సినిమా ద్వారానే చాలా దగ్గర అయింది. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలపిన ఈ ముద్దుగుమ్మ 2019లో బీర్బల్ ట్రైలాజీ కేసు 1: పెండింగ్ వజ్రముని సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది.

ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్టుగా నిలిచినా సప్తసాగరాలు దాచే ఎల్లో సినిమాలో ఆ తర్వాత బగీరా, బాణదరియల్లి, భైరతి రణగల్ వంటి చిత్రాల్లో కూడా మెరిసి మురిపించింది. అయితే తాజాగా ఈమెను రవితేజ కొత్త సినిమాలో తీసుకున్నారు. రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పారు. అగ్రిమెంట్ పై సంతకం కూడా చేశారట. రవితేజ సరసనే రుక్మిణీ వసంత్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు.

 Mass maharaja Raviteja Anudeep Combo Movie Heroine Fixed Check Details

ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం రవితే ఈగల్ సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రావాలనుకోగా.. అప్పటికే చాలా చిత్రాలు విడుదల కావడంతో వెనకడుగు వేశారు. సినిమాను సోలోగా విడుదల చేసేందుకు ఫిక్స్ చేశారు. ముఖ్యంగా ఫిభ్రవరి 9వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X