Eagle Trailer Review: ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు.. ఒక్కసారిగా అంచనాలు పెంచిన ఈగల్ ట్రైలర్
2024 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాల్లో ఒకటి ఈగల్. మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా జనవరి 13న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్. ఇక సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాల్లో ఈగల్ సినిమా ఒకటి. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 13న పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా యూనిట్ ప్రచారం వేగవంతం చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తే కనుక ''తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా?.. దాన్ని పట్టుకున్న వాడిని తాకినపుడు'' అంటూ నవదీప్ డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. 2 నిమిషాల 11 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ మొత్తం అధ్యంతం ఆసక్తిగా సాగింది.
ఇక ఆ తరువాత విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను, విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను అంటూ రవితేజ చెబుతున్న డైలాగ్స్ అన్ని ఆసక్తికరంగా అనిపించాయి. ఇక ఆ తరువాత హీరోయిన్ కావ్య థాపర్ నాకు గన్ అంటే భయం, బుల్లెట్ అంటే భయం కానీ నువ్ వచ్చాక అంతా మారిపోయింది అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వాడి ట్రాన్సక్షన్ అనేక దేశాలకు వెళ్తున్నాయంటే వాడు చాలా డేంజరస్ అని అంటుండగా మేమ్ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఇలాంటి ఫాంటసీ యాక్షన్ స్టోరీస్ ఎప్పుడూ వినలేదని అవసరాల శ్రీనివాస్ అనడం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి . ఏమిరా వీడు దేశం మొత్తం ఖయ్యం పెట్టుకున్నాడా? ఏమి? అంటూ అజయ్ ఘోష్ చెప్పడం చూస్తే ఇదేదో ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అని చుసే వారికి ఫీల్ కలుగుతుంది. వీళ్లను కంగారుపెట్టింది, మొత్తం ప్రాంతం కాదు.. ఆ ప్రాంతాన్ని పండించిన వాడు అని అనుపమా చెబుతుండడం కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తె...ఇక ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











