Eagle Trailer: పద్ధతిగా దాడి చేస్తున్న రవితేజ.. ఖద్దరు దాచిన యుద్ధమే "ఈగల్"
మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రవితేజ హీరోగా రాబోతున్న ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ వంటి వాళ్లంతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సోలోగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.
ఈ ట్రైలర్ స్టార్ అవ్వడం.. మ్యాప్స్ కు, రీసర్చ్ కు అందని విషయం ఒకటి ఉంది సార్ అంటూ శ్రీనివాస్ రెడ్డి డైలాగ్ కొడతారు. ఆ తర్వాత అద్బుతమైన మ్యూజిక్ తో ఓ కోటను చూపిస్తారు. అక్కడ ఒకడుంటాడని మరోసారి శ్రీనివాస్ రెడ్డి చెప్పగా.. హీరో రవితేజను చూపిస్తారు. ఆ తర్వాత పదేళ్లుగా అక్కడ ఓ గాడ్జిల్లా ఉండాదిరా అంటూ అజయ్ ఘోష్ వివరించగా.. లుంగీ కట్టుకుని రవితేజ మరోసారి రచ్చ చేస్తాడు.
నువ్వు వాడి గ్రౌండ్ లో ఉన్నావని విలన్ కు చెప్పగా... ఇది వాడి గ్రౌండ్.. ఇదంతా వాడి అడవి అని విలన్ కోపంగా చెబుతూ కనిపిస్తాడు. ముఖ్యంగా బలం, సైన్యం కాదు... దేశం వచ్చినా ఆపుతానంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఆతర్వాత ఆయన చేసే పైటింగ్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. గరుడ, గరుడ, గరుడ, అంటూ వచ్చే మ్యూజిక్ మరింత అద్భుతం. ఇక చివర్లో నీలాంటోల్లను చాలా మందిని చూశామంటూ అవసరాల శ్రీనివాస్ అనగా... ఆ చాలా మంది చివరగా చూసింది అతడినే అంటూ నవ్ దీప్ ఎవరి గురించో చెబుతాడు. ఇలా ఈ ట్రైలర్ ముగిసింది.

80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరక్కించిన ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మరి మాస్ మహారాజా ఉగ్రరూపం చూపించబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకోనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











