Eagle Teaser: రవితేజ ఈగల్ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్, ఎప్పుడు రాబోతుందంటే?
Eagle Teaser Release: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం "ఈగల్". పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ తో పాటు కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, మోషన్ టీజర్ లు విడుదల చేయగా అనూహ్య స్పందన వచ్చింది. అయితే తాజాగా చిత్రబృందం మరో అప్ డేట్ తో మన ముందుకు వచ్చింది.
ఈగల్ సినిమా టీజర్ విడుదల తేదీతో పాటు సమయాన్ని కూడా ప్రకటించింది చిత్రబృందం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టీజర్ ను నవంబర్ 6వ తేదీ ఉదయం 10 గంటల 44 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈక్రమంలోనే ఓ అదిరిపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ పోస్టర్ లో రవితేజ కళ్లు మాత్రమే కనిపించేలా హైలెట్ చేశారు ఈరోజు విడుదల అయిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. పోస్టర్ చూస్తుంటనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థం అవుతుందంటూ రవితేజ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

అలాగే రవితేజ ఈ సినిమాలో సీక్రెంట్ ఏజెంట్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్, ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో వచ్చి హిట్టు కొట్టిన రవితేజ అదే ఊపులో ఈ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ ఆ సమయంలో పెద్ద పెద్ద చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయని.. సినిమా విడుదలను వాయిదా వేసినట్లు వారం రోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవం అంటూ మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఈగల్ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎన్ని సినిమాలు బరిలో ఉన్నా విడుదల చేసి తీరుతామని చిత్రబృందం చెబుతున్న తీరు చూస్తుంటే... కథపై, వారి సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నట్లు అర్థం అవుతుంది. చూడాలి మరి మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాతో హిట్టు కొట్టి బాక్సాఫీసును కొల్లగొడతారా లేదా అనేది.

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ "ఈగల్" సినిమాతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు "గుంటూరు కారం", రౌడీబాయ్ విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్", అలాగే నవమన్మథుడు నాగార్జున "నా సామి రంగా", తేజ సజ్జ "హనుమాన్", వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో ఏ సినిమా పోటీని ఏది తట్టుకుంటుందో ఏ మేర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో తెలియాలంటే సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











