RC15: రామ్ చరణ్ మూవీ నుంచి కిక్కిచ్చే న్యూస్ లీక్.. RRRను మించేలా శంకర్ ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను దక్కించుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను కూడా తక్కువ సమయంలోనే అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఫలితంగా ఫ్యాన్స్‌కు మజాను పంచుతూనే ఉన్నాడు. ఇటీవలే RRR (రౌద్రం రుధిరం రణం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్.. బ్లాక్ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం అతడిని తీవ్రంగా నిరాశ పరిచింది.

వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్.. ప్రస్తుతం తనదైన శైలి డైరెక్షన్‌తో ఇండియన్ సినీ చరిత్రలోనే దిగ్గజ దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చింది. ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టిన ఈ దిగ్గజ దర్శకుడు.. వాటిని చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం దీన్ని అధికారికంగా మొదలెట్టేశారు. అంగరంగ వైభవంగా ప్రారంభం అయిన ఈ సినిమా.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకుంది.

Mass Song to be Highlight in Ram Charan and S. Shankar Movie

రామ్ చరణ్ - ఎస్ శంకర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత డిసెంబర్‌లోనే మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందించారు. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న చిత్ర యూనిట్ రాజమహేంద్రవరం ప్రాంతంలో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడి గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలోని సముద్ర తీరాల్లో జరుగుతోంది. అక్కడ రామ్ చరణ్‌పై కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ కిక్కిచ్చే న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్లు ఓ మాస్ సాంగ్‌ను పెట్టబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్యూన్‌ను ఎస్ థమన్ సిద్ధం చేసేశాడని తెలుస్తోంది. ఇందులో చరణ్ డ్యాన్స్ మూమెంట్లు అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. RRR అతడు ఎన్టీఆర్‌తో కలిసి వేసిన డ్యాన్స్‌ను మించిపోయేలా ఇది ఉండేటట్లు డిజైన్ చేస్తున్నారట. ఇది సినిమాలోనే వన్ ఆఫ్ ది హైలైట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఈ సినిమా పొలిటిక్ ఎలిమెంట్స్‌తో సాగే డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇందులో చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఇక, ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'సర్కారోడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X