RRR హీరోను టార్గెట్ చేసిన మాస్టర్ డైరెక్టర్.. టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ కోసం..
కోలీవుడ్ సినిమాలకు టాలీవుడ్ లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు అక్కడి స్టార్ హిరోలందరికి తెలుగులో ఎంతో కొంత మార్కెట్ అయితే ఉంది. రానున్న రోజుల్లో వారి స్థాయి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు. ఇక అక్కడి దర్శకులకు కూడా ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడుతోంది. త్వరలో మాస్టర్ డైరెక్టర్ కూడా టాలీవుడ్ అగ్ర హీరోలతో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.
Recommended Video

అక్కడ కూడా భారీ స్థాయిలో..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమాపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. లాక్ డౌన్ తరువాత విడుదలవుతున్న బిగ్ బడ్జెట్ సినిమా ఇదే కావడంతో అందరి చూపు సినిమా కలెక్షన్స్ పైనే ఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్ లోనే కాకుండా హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం..
ఒక విధంగా విజయ్ సినిమాకు మొదటిసారి అన్ని భాషల్లో క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఇక ఈ సంక్రాంతికి రానున్న ఈ సినిమాకు ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవ్వడానికి మరొక ముఖ్య కారణం దర్శకుడు లోకేష్ కనగరాజన్. ఈ దర్శకుడు ఇంతకుముందు మానగరం, కార్తీ ఖైదీ సినిమాను డైరెక్ట్ చేసి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఖైదీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

తెలుగు హీరోలపై..స్పెషల్ ఫోకస్
ఇక దర్శకుడు లోకేష్ కనగరాజన్ కేవలం రెండు సినిమాలతోనే క్రేజ్ అందుకొని మాస్టర్ సినిమాపై అంచనాలు పెరిగేలా డైరెక్ట్ చేసినట్లు విజయ్ లుక్ చూస్తేనే అర్ధనవుతోంది. ఇక ఈ దర్శకుడి కన్ను తెలుగు హీరోలపై కూడా పడినట్లు అర్ధమయ్యింది. నెక్స్ట్ కమల్ హసన్ తో విక్రమ్ సినిమా చేసి ఆ తరువాత డైరెక్ట్ టాలీవుడ్ సినిమా చేయనున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ క్లారిటీ ఇచ్చాడు.

రామ్ చరణ్ కు కథ చెప్పిన లోకేష్
లోకేష్ టాలీవుడ్ లో మొదట RRR హీరోను టార్గెట్ చేసినట్లు కూడా క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ కు ఒక కథ చెప్పినట్లు వివరణ ఇచ్చిన లోకేష్ రానున్న రోజుల్లో టాలీవుడ్ హీరోలతో ఇంకా మరిన్ని సినిమాలు కూడా చేస్తానని ఇంటర్వ్యూలో తెలిపాడు. మరి మాస్టర్ సినిమా అభిమానుల అంచనాలనీ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అంధించాడు.


Click it and Unblock the Notifications











