‘మాస్టర్’ తెలుగు టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: ప్రకటించిన తెలుగు నిర్మాత
పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నాడు ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభంలోనే మాస్ హీరోగా పేరొందిన అతడు.. ఇతర భాషల్లోని సినిమాలను రీమేక్ చేసి సూపర్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం తమిళంలో ఉన్న బడా హీరోల్లో ఒకడైన విజయ్... వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఖైదీ' ఫేం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'మాస్టర్' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్.
కొద్ది రోజుల క్రితం విడుదలైన 'మాస్టర్' తమిళ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తద్వారా 2020లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోగా ఇది రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తెలుగు టీజర్‌ను విడుదల చేయడానికి యూనిట్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 17న దాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు 'మాస్టర్' తెలుగు హక్కులు దక్కించుకున్న నిర్మాత మహేశ్ కోనేరు ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'రెడీగా ఉండండి.. రేపు సాయంత్రం 6 గంటలకు మాస్ మేనియాను విడుదల చేయబోతున్నాం' అని అందులో పేర్కొన్నారు.

కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న 'మాస్టర్'ను దర్శకుడు లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మాలవిక మోహనన్ హీరో విజయ్‌కి జంటగా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా చేస్తున్న ఈ మూవీలో అర్జున్ దాస్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2021 ప్రథమార్ధంలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











