twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మత్తు వదలరా ఫస్ట్ టాక్.. ఏం చెప్పాలన్నా భయమేస్తోంది.. రాజమౌళి రియాక్షన్

    |

    సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా 'మత్తు వదలరా'. ఈ సినిమాతో రితేష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందించాడు. ఈ రోజే (డిసెంబర్ 25) ఈ సినిమా విడుదలైంది. ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

    శ్రీ సింహ క్యారెక్టర్ బాబు మోహన్

    శ్రీ సింహ క్యారెక్టర్ బాబు మోహన్

    హీరోగా పరిచమైన శ్రీ సింహ పేరు ఈ సినిమాలో బాబు మోహన్. 130 నిమిషాల నిడివితో కూడిన ఈ సినిమాలో బాబు మోహన్ ఓ డెలివరీ బాయ్. ఓడిపోయిన ముగ్గురు బ్యాచిలర్ల జీవితాల కథతో ప్రారంభమైన ఈ సినిమా ఆదిలోనే ఆకట్టుకుందని అంటున్నారు. సత్య కామెడీ బాగుందని టాక్ వినిపిస్తోంది.

    విచిత్రమైన పరిస్థితిలో హీరో

    విచిత్రమైన పరిస్థితిలో హీరో

    హీరోకి ఒక డెలివరీ క్రైం సీన్‌గా మారడం, హీరో విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కోవడం లాంటి సీన్స్ బాగున్నాయని, అలాగే ఆ సమయంలో వచ్చే కామెడీ సీన్స్ నవ్వించాయని తెలుస్తోంది.

    ఫస్టాఫ్‌లో ఊహించని ట్విస్టులు

    ఫస్టాఫ్‌లో ఊహించని ట్విస్టులు

    మొత్తంగా చూస్తే ఫస్టాఫ్‌లో ఊహించని కొన్ని ట్విస్టులు, సత్య కామెడీ సీన్స్ హైలైట్ అయ్యాయని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. సరళమైన కథ, కథనం ఉందని చెబుతున్నారు.

    సెకండాఫ్.. వెన్నెల కిషోర్

    సెకండాఫ్.. వెన్నెల కిషోర్

    సెకండాఫ్‌లో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం, మాదక ద్రవ్యాల వ్యాపారం లాంటి సీన్స్ తో పాటు వీటన్నింటికి వెనకాల ఉన్నటువంటి ఓ కీలకమైన వ్యక్తి బయటకు రావడం ఆసక్తి కలిగించిందని అంటున్నారు. హీరోయిన్, వెన్నెల కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారని తెలుస్తోంది.

    సినిమాకు ముగింపు.. మొత్తంగా చూస్తే

    సినిమాకు ముగింపు.. మొత్తంగా చూస్తే

    ఇక ఎవరూ ఊహించని ఓ సరికొత్త ట్విస్ట్‌తో సినిమాకు ముగింపు పలికారని, మొత్తంగా ఇదో ఆసక్తికర కథాంశం అని టాక్ బయటకొచ్చింది. ఇక ఈ సినిమాను చూసిన రాజమౌళి కూడా తన స్పందన తెలిపారు.

    మత్తు వదలరా.. రాజమౌళి రియాక్షన్

    మత్తు వదలరా.. రాజమౌళి రియాక్షన్

    మత్తు వదలరా సినిమా చాలా బాగుందని, తనకు ఎంతో నచ్చిందని రాజమౌళి అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైం థ్రిల్లర్స్, అందులో కామెడీ మిక్స్ అయిన సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని రాజమౌళి చెప్పారు.

    మొదటి 10 నిమిషాల్లో గ్రిప్ లోకి..

    మొదటి 10 నిమిషాల్లో గ్రిప్ లోకి..

    డైరెక్టర్ రితేష్ చాలా గ్రిప్పింగ్‌గా ఈ సినిమా తీశాడని అన్నారు. చివరిదాకా సస్పెన్స్ కొనసాగిస్తూ చాలా గ్రిప్పింగ్‌గా సినిమాను ఆయన ఈ సినిమాను తీసుకెళ్లాలని అన్నారు రాజమౌళి. మొదటి 10 నిమిషాల్లో గ్రిప్ లోకి తీసుకొని దాన్ని కొనసాగించాడని అన్నారు.

    ఏం చెప్పాలన్నా భయమేస్తోంది

    ఈ సినిమా మనోళ్లది కాబట్టి ఏం చెప్పాలన్నా భయమేస్తుందని అన్నారు జక్కన్న. మనోళ్లు కాబట్టే ఎక్కువగా చెబుతున్నారు అనుకుంటారని, అందుకే తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాని రాజమౌళి అన్నారు. కాలభైరవ, శ్రీ సింహ లను చూసి గర్వంగా ఉందని రాజమౌళి అన్నారు.

    English summary
    Mathu Vadalara movie released today. This movie first talk out and Rajamouli reacted on this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X