ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న మూవీస్.. చిన్న సినిమాలే కానీ..
ప్రతివారం ప్రేక్షకులకి వినోదాన్ని అందించేందుకు బిగ్ స్క్రీన్ తో పాటు ఒటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా సిద్ధం అవుతున్నాయి. వీటి ద్వారా కావాల్సినంత వినోదం అందుతోంది. చూసుకునే వారికి చూసుకున్నంత అన్న విధంగా సందడి మొదలవుతోంది. థియేటర్స్ లో చూసుకుంటే ఈ మే 26న పెద్ద సినిమాలు అయితే ఏవీ లేవు కాని కాస్తా బజ్ క్రియేట్ చేసే చిన్న సినిమాలు అయితే ఉన్నాయి.
వాటిని చూసుకుంటే ముందు వరుసగా మేము ఫేమస్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. చాయ్ బిస్కెట్, లహరి మ్యూజిక్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా వస్తోంది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని డిస్టిబ్యూట్ చేస్తూ ఉండటం విశేషం.

దీని తర్వాత నరేష్, పవిత్రా లోకేష్ మళ్ళీ పెళ్లి మూవీపై అటెన్సన్ ఎక్కువగా ఉంది. వారిద్దరి నిజ జీవిత సంఘటనలకి సినిమారూపమే మళ్ళీ పెళ్లి. ఈ మూవీని నరేష్ నిర్మించగా ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంపై కొంత ఆసక్తి నెలకొంది.
అలాగే నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, వైవా హర్ష కాంబినేషన్ లో మెన్ టూ అనే మూవీ కూడా వస్తోంది. ఈ చిత్రంలో మగవాళ్ళపై జరిగే వేదింపులని ఫన్ పాయింట్ లో చూపించారు. అందుకే దీనిపై కూడా ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ ఫేం అలీరెజా లీడ్ రోల్ లో నటించిన గ్రే సినిమా మే 26న రిలీజ్ అవుతోంది. అలాగే షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు పొందిన సున్నీ నవీన్ నటించిన సెకండ్ ఫీచర్ ఫిల్మ్ జైత్రా కూడా రిలీజ్ అవోతోంది.

ఇవి కాకుండా ఒటీటీలో చూసుకుంటే పుష్ప ఫేం కేశవ లీడ్ రోల్ చేసిన సత్తిగాని రెండెకరాలు ఆహాలో మే 26న రిలీజ్ అవుతోంది. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే కాంబో లో వచ్చిన కిసికి జాన్ కిసికా భాయ్ జీ5లో మే 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో దసరా హిందీ డబ్బింగ్ వెర్షన్ మే 25 నుంచి అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications











