విజయ్ దేరకొండ నిర్మిస్తున్న ‘మీకు మాత్రమే చెప్తా’ ఫస్ట్ లుక్ ఇదే..!

'పెళ్లి చూపులు' సినిమా ద్వారా సోలో హీరోగా కెరీర్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఏ స్థాయికి చేరుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విజయ్ దశ మార్చేసింది. తన టాలెంటుతో టాలీవుడ్లో మోస్ట్ డిమాండింగ్ హీరోగా పాపులర్ అయ్యారు. భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

హీరోగా తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు విజయ్. 'కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్' అనే బ్యానర్ స్థాపించిన దేవరకొండ యంగ్ టాలెంట్ ప్రోత్సహించడంలో భాగంగా తొలి అడుగు వేశాడు. తరుణ్ భాస్కర్ హీరోగా నిర్మాతగా తన తొలి సినిమా మొదలు మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి "మీకు మాత్రమే చెప్తా " అనే భిన్నమైన టైటిల్ పెట్టారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

Meeku Matrame Chepta first look relesed

ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్‌తో పాటు అనసూయ భరద్వాజ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్, సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ, పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ. రచన, దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X