‘బంగార్రాజు’ మూవీ నుంచి బ్లాస్టింగ్ న్యూస్: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు భామలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఎన్నో తెరకెక్కుతున్నాయి. వీటిలో చాలా వరకూ మంచి స్పందనను అందుకున్నాయి. దీంతో ఆ తరహా చిత్రాలు మరిన్ని ఎక్కువగా వస్తున్నాయి. అందులో 'బంగార్రాజు' ఒకటి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. 2016లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలైన ఈ మూవీ.. భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసింది. ఫలితంగా నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా వస్తున్నదే 'బంగార్రాజు'.

చాలా కాలం క్రితమే 'బంగార్రాజు' ప్రాజెక్టు బాధ్యతను కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు నాగార్జున. ఈ క్రమంలోనే ఇది అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా వస్తుందన్న టాక్ కూడా వినిపించింది. కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీనికితోడు దీన్ని పక్కన పెట్టి కల్యాణ్.. నాగ చైతన్యతో ఓ సినిమాను కూడా చేశాడు. దీంతో ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు ఆగిపోతుందన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో 'వైల్డ్ డాగ్' మూవీ సక్సెస్ మీట్‌లో 'బంగార్రాజు' త్వరలోనే ప్రారంభం అవుతుందని నాగార్జున ప్రకటించాడు.

Meenakshi Chaudhary and Vedhika Fix For Akkineni Nagarjuns Bangarraju

అక్కినేని నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే 'బంగార్రాజు' సినిమాను ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉన్నా.. కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రారంభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరిపారు. ఆ వెంటనే ఈ మూవీ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్, ఆ తర్వాత కర్నాటకలో మరో షెడ్యూల్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ప్రస్తుతం నాగ చైతన్య 'లవ్ స్టోరీ' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. దీంతో ఈ చిత్ర షూటింగ్‌కు విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

'బంగార్రాజు' సినిమాలో అక్కినేని నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో దేవలోకంలో రంభ ఊర్వశి మేనకల పాత్రలు కూడా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఓ పాత్ర కోసం ఇప్పటికే బిగ్ బాస్ భామ మోనాల్ గజ్జర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు మిగితా రోల్స్ కోసం మీనాక్షి చౌదరి, వేదికను ఫైనల్ చేసినట్లు ఓ న్యూస్ తెలిసింది. అంటే ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. దీంతో 'బంగార్రాజు' ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం అవుతోంది.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే జనవరిలో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా అనూప్ రూబెన్స్ పూర్తి చేశాడు. అలాగే, అదిరిపోయే ట్యూన్స్‌ను కూడా రెడీ చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X