twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas మూవీ ఆఫర్‌పై మీనాక్షి క్లారిటీ: చాలా హ్యాపీ అంటూ కామెంట్స్

    |

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని అతడు.. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే దీని తర్వాత ఈ స్టార్ హీరో 'సాహో' వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో సత్తా చాటింది. దీంతో ప్రభాస్ వరుస పెట్టి ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇలా ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు.

    Jana Gana Mana Story: ముందే లీకైన జన గణ మన మూవీ స్టోరీ.. ఊహించని పాత్రలో విజయ్Jana Gana Mana Story: ముందే లీకైన జన గణ మన మూవీ స్టోరీ.. ఊహించని పాత్రలో విజయ్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో 'సలార్' ఒకటి. ఈ చిత్రాన్ని 'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించి హైలైట్ అయిన ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. గత ఏడాదే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో కంప్లీట్ చేశారు. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండోది కూడా మొదలైంది. ఈ షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను పూర్తి చేశారు.

     Meenakshi Chaudhary Clarity about Salaar Offer

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీకి సంబంధించిన షూట్‌ను గుజరాత్‌లో ప్లాన్ చేసుకున్నా.. కోవిడ్ నిబంధనల కారణంగా దాన్ని హైదరాబాద్‌కు షిప్ట్ చేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమాలోనే ఎంతో హైలైట్ అయిన ప్రీ క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. దీని కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారని అంటున్నారు. దీని కోసం దాదాపు 20 నుంచి 30 రోజుల పాటు షూటింగ్‌ను జరపబోతున్నారట. మరికొన్ని రోజుల్లోనే దీన్ని మొదలు పెట్టబోతున్నారని తెలిసింది.

    టాప్ లేపి చూపించిన నందినీ రాయ్: అద్దం ముందు హాట్ హాట్ ఫోజుతో రచ్చటాప్ లేపి చూపించిన నందినీ రాయ్: అద్దం ముందు హాట్ హాట్ ఫోజుతో రచ్చ

    'సలార్' మూవీలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు ఇందులో మరికొందరు హీరోయిన్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో 'ఖిలాడి' ఫేం మీనాక్షి చౌదరి ఒకరని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ యంగ్ హీరోయిన్ దీనిపై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురవగా.. 'నాకు సలార్ యూనిట్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. దీనికోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ప్రభాస్ గారితో నటించే ఆఫర్ వస్తే మాత్రం చాలా సంతోషిస్తా' అని చెప్పుకొచ్చింది.

    పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. జగపతి బాబు విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

    English summary
    Rebel Star Prabhas Upcoming Movie is Salaar under Prashanth Neel Direction. Now Meenakshi Chaudhary Clarity about This Movie Offer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X