twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hanu-Man: మీనాక్షిని పరిచయం చేసిన విజయ్ సేతుపతి.. ఆమె ఎవరి తాలూకానో తెలిస్తే!

    |

    కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలంతా పంథాను పూర్తిగా మార్చుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మన సినిమాల స్థాయి భారీగా పెరిగిపోవడంతో పాటు మార్కెట్ కూడా గణీనయంగా వృద్ధి చెందడంతో వాళ్లంతా బడా చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో పాన్ ఇండియా రేంజ్ మూవీలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఈ క్రమంలోనే మరికొన్ని చిత్రాలు కూడా పట్టాలెక్కేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా భారీ రేంజ్‌లో రాబోతుంది. అదే క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న 'హనుమాన్' మూవీ.

    Akhanda 11days Collections: 11వ రోజు చరిత్ర సృష్టించిన బాలయ్య.. దెబ్బకు రెండో స్థానానికి చేరిన అఖండAkhanda 11days Collections: 11వ రోజు చరిత్ర సృష్టించిన బాలయ్య.. దెబ్బకు రెండో స్థానానికి చేరిన అఖండ

    విలక్షణ చిత్రాలతో కెరీర్ ఆరంభం నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. దర్శకుడిగా ఎంతో మంచి పేరును సంపాదించుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పటికే 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి విభిన్న తరహా ప్రయోగాత్మక సినిమాలను రూపొందించిన అతడు.. పలు విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా 'హనుమాన్' అనే సినిమాను చేస్తున్నాడు. రియల్ సూపర్ హీరోగా పేరున్న హనుమంతుడి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే దీని నుంచి విడుదలైన మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ వీడియో ఈ చిత్రంపై అంచనాలను పెంచేశాయి.

     Meenakshi First Look Released from Hanu-Man Movie

    హిట్ కాంబోలో రాబోతున్న 'హనుమాన్' మూవీని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ వల్ల అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లలను జరుపుకుంటూ వస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఎంతో గ్రాండ్‌గా మొదలైన ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

    Miss Universe 2021: విశ్వ సుందరిగా భారత యువతి.. ఆ హీరోయిన్ల తర్వాత ఈమె.. ఫినాలేలో అడిగిన ప్రశ్న ఇదేMiss Universe 2021: విశ్వ సుందరిగా భారత యువతి.. ఆ హీరోయిన్ల తర్వాత ఈమె.. ఫినాలేలో అడిగిన ప్రశ్న ఇదే

    'హనుమాన్' మూవీలో హీరోయిన్ ఎవరన్నది చిత్ర యూనిట్ సస్పెన్స్‌గా ఉంచింది. ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ పోషిస్తోన్న మీనాక్షి పాత్రను రివీల్ చేశాడు. ఈ రోల్‌ను క్యూట్ లేడీ అమృత అయ్యర్ చేస్తోంది. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో విజువల్స్ అదిరిపోయేలా డిజైన్ చేశారు. దీనికితోడు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. దీంతో ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. ఇక, ఈ వీడియో షేర్ చేసిన తేజా సజ్జా.. 'హనుమంతు గాడి తాలుకా' అంటూ మీనాక్షిని పరిచయం చేశాడు.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'హనుమాన్' మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ మూవీస్ 'స్పైడ‌ర్‌మ్యాన్‌', 'బ్యాట్‌మ్యాన్' రేంజ్‌లో ఉంటుందని, విజువల్ వండర్‌గా ఉంటూనే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా దీన్ని రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇక, ఈ సినిమాకు అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. నటీనటుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

    English summary
    Talented director Prasanth Varma New Movie with Original Superhero Story Title is HANU-MAN. Now Meenakshi First Look Released From This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X